కశ్మీరీ గేట్ సమీపంలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో మన్మోహన్‌ అంత్యక్రియలు.. పూర్తి షెడ్యూల్ ఇదే

by Mahesh |   ( Updated:2024-12-27 15:42:23.0  )
కశ్మీరీ గేట్ సమీపంలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో మన్మోహన్‌ అంత్యక్రియలు.. పూర్తి షెడ్యూల్ ఇదే
X

దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ (Manmohan Singh)గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ (Delhi)లోని ఏయిమ్స్‌ (AIMS)లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా మాజీ ప్రధాని అంత్యక్రియలు కేంద్రం (Central) అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కాగా మన్మోహన్ అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. కశ్మీరీ గేట్(Kashmiri Gate) సమీపంలోని.. నిగమ్‌బోధ్ ఘాట్‌(Nigambodh Ghat)లో రేపు మన్మోహన్‌ అంత్యక్రియలు చేయనున్నారు.

ఈ రోజు రాత్రి అమెరికాలో ఉన్న మన్మోహన్ సింగ్ కుమార్తె(Daughter of Manmohan Singh).. భారత్ రానుంది. అనంతరం రేపు ఉదయం 9.30 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా.. రేపు ఉదయం 8 గంటలకు ఏఐసీసీ కార్యాలయానికి మన్మోహన్ సింగ్ పార్ధివదేహాన్ని(Pardhivadeham) తీసుకెళ్లనున్నారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు ఏఐసీసీ కార్యాలయం(AICC office)లో మాజీ ప్రధాని పార్థీవ దేహాన్ని ఉంచనున్నారు. రేపు ఉదయం 11:15 గంటలకు అంత్యక్రియలు ప్రారంభం అవుతాయి. 11:45కు మతపరమైన కార్యక్రమాలతో మాజీ ప్రధాని మన్మోహస్ సింగ్ అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed