- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముద్దయిపేట్ రేణుక ఎల్లమ్మ జాతర భక్తులపై కుక్కల దాడి
by Kalyani |
X
దిశ, తాండూరు పట్టణం: ప్రముఖ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం జాతర భక్తులపై కుక్కలు దాడి చేశాయి. శుక్రవారం ముద్దయిపేట్ శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలకు వెళ్లిన భక్తులపై కుక్కలు దాడి చేయడంతో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని తాండూరు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అందులో యాలాల మండలం పగిడియాల్ గ్రామానికి చెందిన లక్ష్మమ్మ, విశ్వనాథ్ పూర్ గ్రామానికి చెందిన లాలమ్మ, ఇద్దరు వృద్ధులు కూడా ఉన్నారు. తాండూర్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం కొందరిని హైదరాబాద్ పంపించారు. ఇద్దరు చిన్నారులను తాండూరు మాత శిశు సంరక్షణ ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Next Story