గూడూరులో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

by Kalyani |
గూడూరులో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి
X

దిశ,గూడూరు: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన బొడ్డుపల్లి లింగయ్య గూడూరు నుంచి బ్రాహ్మణపల్లి కి బైక్ పై వెళ్తుండగా మండలంలోని గాజుల గట్టు గ్రామానికి చెందిన మనోజ్ కుమార్ మహబూబాబాద్ నుండి గూడూరు కు వస్తున్న క్రమంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బొడ్డుపల్లి లింగయ్య(48) మృతి చెందాడు. మనోజ్ కుమార్ పరిస్థితి కూడా విషమంగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed