- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ ప్రధాని పార్థివ దేహానికి నివాళులర్పించిన కేంద్ర సహాయ మంత్రి
దిశ ప్రతినిధి,గుంటూరు: ఆర్థికవేత్త, భారతదేశ మాజీ ప్రధానమంత్రి, మన్మోహన్ సింగ్ గారి పార్థివదేహానికి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు నివాళులర్పించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పలువురు ఎంపీలతో కలిసి పెమ్మసాని గారు మోతిలాల్ మార్గ్ లోని మన్మోహన్ సింగ్ గారి నివాసానికి శుక్రవారం ఉదయం చేరుకున్నారు. మాజీ ప్రధాని మృతి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు.
1991 సమయాన సంక్షోభంలో ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఎన్నో నిశ్శబ్ద మార్పులు తీసుకొచ్చిన ఆర్థికవేత్త సేవలు భారతదేశం ఎప్పటికీ మరువలేనివని ఈ సందర్భంగా పెమ్మసాని గారు అన్నారు. ఆర్థిక మంత్రిగా, రెండు దఫాలు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన క్రమంలో మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న ఎన్నో నిర్ణయాలు దేశంలో గణనీయ మార్పులు తీసుకు వచ్చాయన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ రూపశిల్పిగా పేరుగాంచిన మన్మోహన్ సింగ్ గారి అడుగుజాడలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని తెలిపారు.
Read More..
AP News:‘ఆ ధర్నాలేవో జగన్ ఇంటి ముందు చేయండి’.. మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు