పేదల ఆరోగ్యం కోసమే ఉచిత వైద్య శిబిరం

by Naveena |
పేదల ఆరోగ్యం కోసమే ఉచిత వైద్య శిబిరం
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: గ్రామీణ ప్రాంతాల పేదల ఆరోగ్యం కోసమే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు విశ్రాంత బ్యాంకు మేనేజర్ కెవి.అశోక్ అన్నారు. శుక్రవారం నర్వ మండలం ఉందేకోడు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మహబూబ్ నగర్ ఎస్వీఎస్ హాస్పిటల్స్ వారు ఏర్పాటు చేసిన..ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.ఆరోగ్యం పట్ల గ్రామీణ ప్రజలు నిర్లక్ష్యం,అజాగ్రత్తగా వ్యవహరిస్తారని,వారికి అవగాహన కల్పించేందుకు తరచూ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ శిబిరంలో ప్రజలకు,విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి,మందులను పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీఎస్ హాస్పిటల్ వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ పీఆర్వో బస్వరాజ్, డాక్టర్లు,గ్రామ మాజీ సర్పంచ్ బాలరాజు,జగన్నాథ్,శ్రీకాంత్,శంకరయ్య,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed