- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Harish Rao : మందు అమ్మకపోతే సీఎం రేవంత్ రెడ్డి పాలనలో మోమోలు : హరీశ్ రావు
దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాలనలో ధాన్యం, పత్తి కొనుగోలు సక్రమంగా జరిపించలేని అధికారులకు కాకుండా మద్యం ఎక్కువ అమ్మించని అధికారులకు మోమోలు ఇచ్చారని మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao)ఎద్దేవా చేశారు. మహాబూబ్ నగర్ జిల్లా పర్యటనలో కురుమూర్తి స్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. పోయిన ఏడాది కంటే మందు తక్కువ అమ్ముతున్నారని 35మంది ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లకు, 15 మంది ఎక్సైజ్ సూపరిండెంట్లకు మోమోలు ఇచ్చారన్నారు. మద్యం అమ్మకపోతే మోమోలు ఇస్తున్న ముఖ్యమంత్రి వడ్లు కొనకపోతే మాత్రం అధికారులను అడుగుతలేడని.. వాళ్లకి మెమోలు ఇస్తలేడని విమర్శించారు. మందు బాగా అమ్మండని రేవంత్ రెడ్డి చెప్తున్నాడని, తాగుబోతులా తెలంగాణ చేద్దామని అనుకుంటున్నాడని ఆరోపించారు. పోయిన ఏడాది మద్యం ఆదాయం మీద 10వేల కోట్లు అదనంగా ఆదాయం రావాలని ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి పెడుతున్నాడని విమర్శించారు. కురుమూర్తి దేవుడి వద్ద పంద్రాగస్టు లోపల 2లక్షల రుణమాఫీ చేస్తామని చేయలేదని, కురుమూర్తి వద్ద కూడా ప్రాయశ్చిత్తం చేసుకోలేదన్నారు. కొడంగల్ ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి తప్పాడని, ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలపై బాండుపేపర్ రాసి తప్పాడన్నారు. మాట తప్పడం రేవంత్ కు అలవాటుగా మారిందన్నారు. నిద్రలో కూడా రేవంత్ రెడ్డికి కేసీఆర్ గుర్తుకొస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ భయం పట్టుకుందన్నారు.
రుణమాఫీలో ముందుగా 41వేల కోట్లు, తర్వాత 31వేల కోట్లు, బడ్జెట్ లో 26కోట్లు అని చెప్పి 17వేల కోట్లు మాత్రమే చేశాడన్నారు. 42లక్షల మంది రైతులకు చేస్తామని చెప్పి ఇంకా 22లక్షల మందికి చేయలేదన్నారు. మళ్లీ నన్ను రాజీనామా చేయమంటాడని, కేసీఆర్ చెబితే మూడుసార్లు రాజీనామా చేశానని, రుణమాఫీ చేస్తే మళ్లీ చేస్తానన్నారు. వరంగల్ డిక్లరేషన్ లో చేసిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. సోనియాగాంధీని బలిదేవత అని ఇప్పుడు మా అమ్మ అంటున్నాడన్నారు. మోసం, అబద్దాలు రేవంత్ డీఎన్ఏలో ఉన్నాయన్నారు. ప్రతిపక్షాలపై పగ, ప్రజలకు దగా తప్ప రేవంత్ రెడ్డి ఎజెండా మరోకటి లేదన్నారు. సీఎం రేవంత్ వచ్చాకా రైతు బంధు సహా కేసీఆర్ స్కీమ్ లు అన్ని కోల్పోయరన్నారు. ఎగవేతల సీఎంగా రేవంత్ రెడ్డి మారాడన్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక ఏం వచ్చిందంటే బీ, ఆర్, యూ ట్యాక్స్ లు వచ్చాయని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ని ఆరు గ్యారంటీలు అమలు చేసేదాక వదిలేది లేదన్నారు. కేసీఆర్ పాలనతో నిరంతర విద్యుత్తు రాగా, పెండింగ్ ప్రాజెక్టులు రన్నింగ్ ప్రాజెక్టులుగా మారగా, ఒక్క పంటకే కోటి 89లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందన్నారు. అదంతా కేసీఆర్ ఘనతేనని, కాంగ్రెసోళ్లు వచ్చాక ఒక్క ప్రాజెక్టు కట్టలేదన్నారు. రేవంత్ పాలనలో రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు. మూసీ మురికి కంటే రేవంత్ నోటి మురికే ఎక్కువగా ఉండి రాష్ట్రం నష్టపోతుందన్నారు.