Harish Rao : సీఎం పట్టించుకోడు..మీరైన విద్యార్థుల సమస్యలను పరిష్కరించండి : హరీశ్ రావు

by Y. Venkata Narasimha Reddy |
Harish Rao : సీఎం పట్టించుకోడు..మీరైన విద్యార్థుల సమస్యలను పరిష్కరించండి : హరీశ్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ఎలాగు విద్యాశాఖను పట్టించుకోడని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు అయినా ప్రభుత్వ పాఠశాలలు సందర్శించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao) కోరారు. రాష్ట్ర రాజధాని స్కూళ్లలో మధ్యాహ్న భోజనం అధ్వాన్నం అన్న వార్త కథనాలపై ఆయన ట్విటర్ వేదికగా స్పందిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఉడకని అన్నం, నీళ్ళ చారు, నాణ్యత లేని పప్పు, వారానికి మూడు సార్లు ఇచ్చే గుడ్డు మాయమైందని, ఏడాదిగా నిలిచిన గుడ్డు పంపిణీ అని మధ్యాహ్న భోజన పథకం తీరుపై విమర్శలు చేశారు.

బిల్లులు రాక నిర్వాహకులు అవస్థలు పడుతున్నారని, 11 నెలలుగా వేతనాల కోసం భోజన కార్మికులు ఎదురుచూస్తున్నారని, ఈ సమస్యలన్ని రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి నిదర్శనమని హరీష్ రావు తెలిపారు. పేద విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తు పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్పష్టం అవుతోందని, కనీసం కలెక్లర్లు అయినా ప్రభుత్వ పాఠశాలలు సందర్శించి సమస్యలు పరిష్కరించాలని హరీష్ రావు కోరారు. అంతకుముందు ఆయన గురుకుల పాఠశాలల సమస్యలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed