Theaters: షాకింగ్ నిర్ణయం తీసుకున్న నిర్మాతల మండలి.. థియేటర్ ప్రాంగణంలోకి వారికి నో ఎంట్రీ!

by sudharani |
Theaters: షాకింగ్ నిర్ణయం తీసుకున్న నిర్మాతల మండలి.. థియేటర్ ప్రాంగణంలోకి వారికి నో ఎంట్రీ!
X

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా (Social Media) ఫ్లాట్‌ఫామ్స్ ఎక్కువైపోతున్నాయి. ఎక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగిన అది క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. అయితే.. ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ ఎఫెక్ట్ ఎక్కువగా సినిమాలపై కూడా పడుతోంది. కొత్త మూవీస్‌ (New Movies) రిలీజ్ అయిన వెంటనే కొంతమంది నెటిజన్లు, కొన్ని చానల్స్ వారు ఇచ్చే రివ్వూస్ కారణంగా కంటెంట్ బాగున్న చిత్రాలు కూడా ప్రేక్షకులకు రీచ్ అవ్వడం లేదు. ఈ క్రమంలోనే ఇలాంటి రివ్యూల వల్ల సినిమాలు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండేందుకు తమిళ చిత్ర నిర్మాతలు (Tamil Film Producers) ఓ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ‘ఈ ఏడాది విడుదలైన చాలా మూవీస్‌పై రివ్యూస్ (Reviews) ప్రభావం దారుణంగా చూపించాయి. ముఖ్యంగా ‘ఇండియన్ 2’ (Indian 2), ‘వేట్టయన్’ (Vettayan), ‘కంగువ’ (Kanguva) ఫలితాలపై పబ్లిక్ టాక్ (Public Talk), యూట్యూబ్ చానెల్స్ (YouTube Channels) ఇచ్చే రివ్యూ ఎంతో ఎఫెక్ట్ చూపింది. రానురాను సిని ఇండస్ట్రీకి ఇదొక సమస్యగా మారుతోంది. దీనిని కట్టడి చేసేందుకు పరిశ్రమలోని అన్ని సంఘాలు ఏకం కావాలి. పరిశ్రమ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి. ఇందులో భాగంగా థియేటర్ యజయానులు యూట్యూబ్ చానల్స్‌ను సినిమా హాళ్ల ప్రాంగణంలోకి అనుమతించకూడదు. ఫస్ట్ డే (first day).. ఫస్ట్ షో (First Show) సమయంలో థియేటర్‌ల వద్ద పబ్లిక్ రివ్యూలకు అవకాశం కల్పించకూడదు. అలాగే, రివ్యూల పేరుతో నటీనటులు (actors), దర్శక నిర్మాతల (Director Producers)పై వ్యక్తిగత విమర్శలను మేము ఖండిస్తున్నాం. ఇకపై అలాంటి వాటికి పాల్పడితే అంగీకరించేది లేదు’ అంటూ నోట్ షేర్ చేశారు. కాగా.. ఇటీవల వచ్చిన ‘ఇండియన్ 2’, ‘వేట్టయన్’, ‘కంగువా’ చిత్రాల గురించి కొంత మంది నెగిటివ్ రివ్యూలు ఇవ్వడంతో పాటు.. నటీనటులపై, దర్శక నిర్మాతలపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే తమిళ చిత్ర నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఇప్పుడు ఈ ప్రభావం మిగిలిన ఇండస్ట్రీలపై పడుతుందో లేదో.. వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.



Advertisement

Next Story