- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
PM Modi క్యూ కట్టి అత్యున్నత పురస్కారాలిస్తున్న దేశాలు
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీకి తమ దేశ అత్యున్నత పురస్కారాలను ఇవ్వడానికి అనేక దేశాలు క్యూ కడుతున్నాయి. జీ20 సదస్సు కోసం బ్రెజిల్ వెళ్లిన పీఎం మోడీ అక్కడి నుంచి నైజీరియా పర్యటించగా.. అక్కడి ప్రభుత్వం ఆయనను తమ దేశ అత్యున్నత పురస్కారమైన GCON అవార్డుతో సత్కరించింది. ఎప్పుడో 1969లో క్వీన్ ఎలిజబెత్‌ను ఈ అవార్డుతో సత్కరించిన నైజీరియా ప్రభుత్వం ఆ తర్వాత మోడీకి ఈ అవార్డును ప్రకటించడం విశేషం. ఇక ఇప్పుడు మరో రెండు దేశాలు తమ దేశ అత్యున్నత పురస్కారాలతో మోడీని సత్కరించనున్నట్లు తెలిపాయి. గయానా దేశం తమ దేశపు హయ్యస్ట్ అవార్డ్ అయిన ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ’తో మోడీని సత్కరించబోతున్నామని చెప్పగా.. బార్బడోస్ కూడా తమ అత్యున్నత పురస్కారం ‘హానరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్’ను మోడీకి అందించనున్నామని వెల్లడించింది. కొవిడ్ కష్టకాలంలో వ్యాక్సిన్లు అందజేసి సాయం చేసినందుకు గానూ ఈ రెండు దేశాలూ కృతజ్ఞతతో ఈ అవార్డులు అందిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఇంతకుమునుపే రష్యా, సౌదీ, యూఏఈ, ఆఫ్ఘనిస్తాన్, పాలస్తీనా, మాల్దీవ్స్, భూటాన్, ఫిజి, ఫ్రాన్స్, గ్రీస్, డొమినికా వంటి అనేక దేశాలు మోడీని తమ దేశ అత్యున్నత పురస్కారాలతో సత్కరించిన విషయం తెలిసిందే.