US embassy: రష్యా- అమెరికా ఉద్రిక్తతల వేళ అమెరికా కీలక ప్రకటన

by Shamantha N |
US embassy: రష్యా- అమెరికా ఉద్రిక్తతల వేళ అమెరికా కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా- ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్ లోని రాయబార కార్యాలయాన్ని(US embassy) తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అమెరికా (USA) ప్రకటించింది. కీవ్‌లోని తమ దౌత్య కార్యాలయంపై రష్యా (Russia) బుధవారం వైమానిక దాడులకు(major air attack) పాల్పడే అవకాశం ఉందని తమకు సమాచారం వచ్చిందని అమెరికా వెల్లడించింది. అందుకే, ఎంబసీని మూసివేయాలని నిర్ణయించుకున్నామంది. దాడి జరగబోతోందని తమకు కచ్చితమైన సమాచారం అందిందని వెల్లడించింది. రాయబార కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఎయిర్‌ అలర్ట్‌లు ప్రకటించగానే కీవ్‌లోని అమెరికా పౌరులు షెల్టర్లలోకి వెళ్లిపోవాలని కోరింది.

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం (Ukraine Crisis) విషయంలో అమెరికా జోక్యం చేసుకుంది. ఈనేపథ్యంలో రష్యా పైకి దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్‌కు అమెరికా అనుమతివ్వడంతో రష్యా అమెరికాపై గుర్రుగా ఉంది. దీంతో, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin) అణ్వాయుధాల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సడలించే సర్టిఫికెట్లపై సంతకం చేశారు. న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే.. దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని అందులో పేర్కొన్నారు. మరోవైపు అమెరికా ఇచ్చిన అనుమతితో ఉక్రెయిన్‌ ఏకంగా ఆరు దీర్ఘశ్రేణి క్షిపణుల్ని(ఆర్మీ టాక్టికల్‌ మిస్సైల్‌ సిస్టమ్‌) రష్యా పైకి ప్రయోగించింది. ఇందులో ఐదింటిని కూల్చేశామని, మరో దాన్ని ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. దీంతో, యూరప్ లోని అన్ని దేశఆలు అప్రమత్తమయ్యాయి. ఈ ఉద్రిక్తతల వేళ, చిన్న పిల్లల ఆహార పదార్థాలు, ఔషధాలు, తాగునీటిని నిల్వ చేసుకోవాలని కొన్ని నాటో దేశాలు తమ ప్రజలకు సూచించాయి.

Advertisement

Next Story