పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు.. YS షర్మిల కీలక నిర్ణయం

by GSrikanth |
పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు.. YS షర్మిల కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన నేపథ్యంలో తన పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంపై మహిళా కమిషన్‌ను ఆశ్రయించబోతున్నట్లు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. సోమవారం జాతీయ మీడియాతో మాట్లాడిన షర్మిల తన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశాన్ని మహిళా కమిషన్ ముందు ఉంచి తనకు న్యాయం చేయాలని కోరుతాన్నారు. తాను మాట్లాడిన మాటల పూర్వపరాలన్నింటినీ ఆధారాలతో సహా కమిషన్‌కు అందజేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే శంకర్ నాయకే తొలుత తనపై అసభ్యకరంగా మాట్లాడారని దాంతో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రశ్నించినందుకే తనపై బీఆర్ఎస్ ఎదురుదాడికి దింగిదన్నారు.

పాదయాత్రను అడ్డుకున్నారని తనను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడాన్ని తాను ప్రశ్నిస్తుంటే అధికార పార్టీ తనను టార్గెట్ చేస్తోందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు భాష నిజంగా అభ్యంతరకరంగా ఉన్నాయని కొంత మంది నన్ను నల్లిని నలిపినట్లు నలిపిస్తామని హెచ్చరిస్తున్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తాను మాట్లాడిన మాటలను మాత్రం పరిగణలోకి తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకర్ నాయక్ పై నేను వ్యాఖ్యలు చేయగానే తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు, అతడు ఎస్టీ సామాజిక వర్గం నుంచి వచ్చినంత మాత్రాన తనపై అతడు అసభ్యకరంగా మాట్లాడవచ్చు కానీ నేను అతడిని ప్రశ్నించకూడదా అన్నారు. తనపై జరుగుతున్న దాడిని మహిళా కమిషన్ వద్దే తేల్చుకుంటాన్నారు.

Advertisement

Next Story

Most Viewed