- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విజయోత్సవాలు కాదు.. వంచనోత్సవాలు: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ఏడాది పాలనపై విజయోత్సవాలు నిర్వహిస్తోందని, 11 నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏం సాధించారని, ఇది విజయోత్సవం కాదని, వంచనోత్సవాలుగా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హామీలు ఇచ్చి మోసం చేసిన రేవంత్‌రెడ్డి ఏం ముఖం పెట్టుకుని వేడుకలు నిర్వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం అప్పులపాలు అవ్వవడానికి కారణం ఆయనేనని ఫైరయ్యారు. ఈ విజయోత్సవాల్లో చెప్పుకోవడానికి ఏమిలేక విపక్షాలపై విమర్శలు చేస్తున్నారని, ప్రధాని మోడీ, కిషన్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ పేరు పలికేందుకు కూడా రేవంత్‌కు అర్హత లేదని ఘాటుగా ఏలేటి స్పందించారు.
సోనియా కాళ్లు కడిగి నెత్తిమీద పోసుకుంటానని రేవంత్ చెబుతున్నాడని, ఇదంతా సీఎం పదవి కోసం ప్రసన్నం చేసుకోవడానికే కదా అంటూ ఫైరయ్యారు. కాంగ్రెస్‌లో చేరకముందు ఆమెను బలి దేవత అన్న వ్యక్తి ఇప్పుడు ఆమె కాళ్ల నీరు చల్లుకుంటానని అంటున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతోనే ప్రసన్నం చేసుకునే పనిలో రేవంత్ పడ్డారన్నారు. ఇంత చంచలమైన మనస్తత్వమున్న వ్యక్తిని ఎక్కడా చూడలేదన్నారు. సోనియా కాళ్లు కడుగుతావో.. రాహుల్ కాళ్లు కడిగి నీళ్లు చల్లుకుంటావో రేవంత్ ఇష్టమని, కానీ మోడీపై విమర్శలు చేస్తే ఖబడ్దార్.. రేవంత్ అంటూ మహేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. టీడీపీలో ఉన్న సమయంలో రేవంత్.. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించారని, ఆ విషయాన్ని మరిచావా అంటూ ధ్వజమెత్తారు. రేవంత్ పచ్చి అవకాశవాది.. అనేందుకు ఆయన వ్యాఖ్యలు నిదర్శనమని పేర్కొన్నారు. ఆయన అదృష్టవశాత్తు సీఎం అయ్యారని ఎద్దేవా చేశారు. ఇలా మాట్లాడి అభాసుపాలు కావద్దన్నారు. 11 నెలల్లో మీరు సాధించింది ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. అదే 11 నెలల్లో రాష్ట్రం ఎలా నష్టపోయిందో తాము చెబుతామని సవాల్ చేశారు.
ఇచ్చిన హామీలు మరిచి ఎనుముల నుంచి కాస్త ఎగవేతల రేవంత్‌రెడ్డిగా మిగిలారని, ప్రజలు కూడా ఎగవేతల రేవంత్ అనే పిలుస్తున్నారని ఏలేటి మండిపడ్డారు. విజయోత్సవాలు కాకుండా ఎగవేతల ఉత్సవాలు చేసుకోవాలంటూ ఎద్దేవా చేశారు. సీఎం అవ్వగానే మొదటి సంతకం ఆరు గ్యారెంటీలపై రేవంత్ పెట్టారని, వాటికి చట్టబద్ధత కల్పిస్తానని చెప్పారని.. ఏడాది కావొస్తున్నా ఎందుకు చట్టబద్ధత కల్పించలేదో సమాధానం చెప్పాలన్నారు. మోసం చేశామని చెప్పడానికి విజయోత్సవాలు చేస్తున్నారా.. అని ఫైరయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన లగచర్లలో పరిస్థితి ఏంటని, ఆ దుస్థితికి కారణమెవరని ఏలేటి ప్రశ్నించారు.
గిరిజన బిడ్డలపై జరిగిన దాడులు, భూములు లాక్కోవడం.. ఇవన్నీ ప్రజలకు తెలియదనుకుంటున్నారా అంటూ ఫైరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్.. ఎక్కడికో వెళ్లడం ఎందుకని, తన సొంత అసెంబ్లీ సెగ్మెంట్‌కే వెళ్దామని, వారైనా ఆయనను సమర్ధిస్తారో లేదో చూద్దామని పేర్కొన్నారు. సీఎంకు దమ్ముంటే.. రాజీనామా చేసి మళ్లీ కొడంగల్ నుంచి పోటీ చేయాలని ఏలేటి సవాల్ విసిరారు. ఆయన సెగ్మెంట్లోనే కనీసం ఓట్లు పడే అవకాశం లేదన్నారు. 11 నెలల్లో శాఖలవారీగా ఏం చేశారో చెప్పగలవా అని, డిబేట్‌కు మమ్మల్ని పిలిచి చెప్పే దమ్ముందా అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.
హైడ్రా పేరిట ఇండ్లు కూల్చినందుకు ఉత్సవాలు నిర్వహిస్తున్నారా.. లేదా ఇండ్లు కూల్చి కొందరిని బెదిరించి సెటిల్‌మెంట్ చేసుకున్నందుకా? ఓవైసీ భవనాలు కూల్చకుండా కాపాడుతున్నందుకా విజయోత్సవాలు నిర్వహించేదని ఏలేటి ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం, మిషన్ భగీరథ, ఫోన్ ట్యాపింగ్, కార్ రేసింగ్‌లో అవినీతి జరిగిందని, అన్ని కక్కిస్తానని చెప్పారని, మరి వారిపై చర్యలేవని ప్రశ్నించారు. ఈ ఏడదిలో బాగుపడింది రేవంత్.. ఆయన ఆస్థాన అనుచరులు మాత్రమేనని ఏలేటి చురకలంటించారు. రేవంత్ అంటే ఆర్, రేవంత్ అంటే ఆర్ఆర్, రేవంత్ అంటే ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ సెటైర్లు వేశారు. పోలీసులను పెట్టుకుని ఉత్సవాలు చేయడం కాదని, ప్రజల్లోకి వచ్చి ఉత్సవాలు నిర్వహించాలన్నారు. ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం ఇదని, వీరికి గంట కూడా అధికారంలో ఉండే హక్కు లేదని మహేశ్వర్‌రెడ్డి విమర్శలు చేశారు.