Erdogan: అమెరికాది తప్పుడు నిర్ణయం.. తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్

by vinod kumar |
Erdogan: అమెరికాది తప్పుడు నిర్ణయం.. తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా భూభాగంపై అమెరికా సుదూర శ్రేణి క్షిపణులను ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు అనుమతివ్వడం సరికాదని తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ (Recep Tayyip Erdogan) అభిప్రాయపడ్డారు. యూఎస్ (USA) తీసుకున్న డిసిషన్‌తోయుద్ధం మరింత తీవ్రమయ్యే చాన్స్ ఉందని తెలిపారు. బుధవారం ఆయన ఇస్తాంబుల్‌ (Isthamble)లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. అమెరికా తీసుకున్న నిర్ణయం వల్ల ఘర్షణ మరింత ఎక్కువ అవుతుందని తెలిపారు. ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడే అవకాశం ఉందని నొక్కి చెప్పారు. యుద్ధానికి ఆజ్యం పోసే దిశగా అమెరికా చర్యలు ఉన్నాయన్నారు. ఉద్రిక్తతలు రోజు రోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతి దేశం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో తుర్కియే రెండు దేశాలతోనూ స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించింది. ఉక్రెయిన్‌కు డ్రోన్‌లను సరఫరా చేయగా, రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల నుంచి దూరంగా ఉంది. అంతకుముందు రోజు దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించేందుకు అమెరికా ఉక్రెయిన్‌కు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎర్డోగాన్ స్పందించారు.

Advertisement

Next Story

Most Viewed