Breaking: తమిళనాడుకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే..!

by srinivas |   ( Updated:2025-03-21 16:03:07.0  )
Breaking: తమిళనాడుకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) తమిళనాడుకు చేరుకున్నారు. చెన్నై(Chennai)లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాలిన్(Cn Stalin) నేతృత్వంలో శనివారం నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సైతం చెన్నై వెళ్లారు. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల భేటీకి స్టాలిన్ ఇచ్చిన పిలుపుతో అఖిలపక్షం సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకున్నారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చెన్నై పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరే వరకూ అటు ఇరు రాష్ట్రాల పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేయనున్నాయి.

కాగా కేంద్రప్రభుత్వం త్వరలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టబోతోంది. అయితే ఈ ప్రక్రియను తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 2026 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్(Delimitation) జరిగితే పార్లమెంట్‌(Parliament)లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం, హక్కులు దెబ్బతింటాయని సీఎం స్టాలిన్ ఆరోపిస్తున్నారు. పునర్విభజన జరిగితే 1971 జనాభా లెక్కల ఆధారంగా జరగాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే రాజ్యాంగ సవరణలు జరగాలని అంటున్నారు. ఈ అంశంపై చర్చించేందుకు ఈ నెల 22న చెన్నైకు రావాలని ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్టాలిన్ లేఖ రాశారు. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం చెన్నై వెళ్లింది

Next Story