- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇందిరా నగర్ లో నీటి ఎద్దడి.. నెల రోజులుగా ప్రజలకు తప్పని ఇక్కట్లు...

దిశ,కార్వాన్: మల్లేపల్లి ఇందిరానగర్ లో రోజు రోజుకి నీటి ఎద్దడి తీవ్రతరంగా మారుతుంది. ప్రతిరోజు నీళ్ళ కష్టాలతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నీటి కోసం ఫిర్యాదులు చేసిన అధికారులు కుంటి సాకులు చెబుతూ కాలయాపన చేస్తుండడంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. వేసవి కాలం దృష్ట్యా జలమండలి అధికారులు ప్రజల సౌకర్యార్థం నీళ్ల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాగా సర్కిల్ 12 ఓల్డ్ మల్లేపల్లి న్యూ ఇందిరా నగర్ లో మాత్రం జలమండలి అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. న్యూ ఇందిరానగర్ లో దాదాపు నెల రోజుల నుంచి త్రాగు నీరు సమస్య స్థానికులను వెంటాడుతుంది. అవసరాలకు అటు ఉంచి కనీసం తాగేందుకు కూడా నీళ్ళు రావడం లేదని స్థానికులు మండి పడుతున్నారు. సంబంధిత అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేసిన ఏదో సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారనే అపవాది మూటగట్టుకున్నారు. నీళ్లు రాక దళారులకు డబ్బులు వెచ్చించి ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మునిరాతి రామ కృష్ణ నవోదయ సేవా సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ.. నాంపల్లి నియోజకవర్గం ఓల్డ్ మల్లెపల్లి న్యూ ఇందిరా నగర్ లో నెల రోజుల నుంచి త్రాగు నీరు రావడం లేదు. పలు మార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించడం లేదని తెలిపారు. గతంలో ఎలాంటి సమస్యలు లేవు. అధికారుల బదిలీలతో సమస్యలు మొదలయ్యాయి. అంతే కాకుండా డ్రైనేజీ సమస్య కూడా ప్రధాన సమస్య అని తెలిపారు. వర్షాకాలం వస్తే చిన్న చినుకు పడ్డ డ్రైనేజీ పొంగి పొర్లుతుంది. దీంతో స్థానికులు, పిల్లలు నడిచేందుకు కూడా భయపడుతున్నారు. గతంలో స్కూల్ పిల్లలు సైతం మురికి నీటిలో పడిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి. డ్రైనేజీ మ్యాన్ హోల్స్ మూతలు, పైప్ లైనుకు సంబంధించి సమస్యల విషయం పై అధికారులకు కూడా ఫిర్యాదు చేశాం. ప్రజా ప్రతినిధులు, అధికారులు కనీసం ఒక్క సారి కూడా విజిట్ చేయలేదని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో స్థానికులతో కలిసి సంబంధిత అధికారుల కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు.