- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పంట వేయమన్నారు.. పత్తా లేకుండా పోయారు..

దిశ, మల్హర్ : మండల కేంద్రం తాడిచెర్ల గ్రామానికి చెందిన అర్ని ప్రసాద్ అనే రైతు విన్ క్రాప్ సీడ్ మొక్కజొన్న మేల్, ఫిమేల్ హైబ్రిడ్ పంటను వేశాడు. పంట చేతికొచ్చింది కానీ కంపెనీ నిర్వాహకులు తీసుకోకపోవడంతో బాధిత రైతు విలవిలలాడుతున్నాడు. కంపెనీ నిర్వాహకులు ఆర్ని ప్రసాద్ తో ఒప్పందం కుదిరించుకొని మొక్కజొన్న పంట వేయించారు. అయితే పంట చేతికి వచ్చిన సీడ్ కంపెనీ నిర్వాహకులు తీసుకోకపోవడం, చేన్లో నిల్వ ఉండడంతో ఆవులు, అడవి పందులు, కోతులు, చిలుకల బెడద తీవ్రం కావడం వల్ల కాపలా ఉండలేక నానా తంటాలు పడుతున్నాడు. కంపెనీ నిర్వాహకులకు ఎన్నోసార్లు సమాచారం ఇచ్చినా ఇటువైపు రావడం లేదని, ఫోన్ చేసినా స్పందించడం లేదని బాధితుడు తెలిపారు.
విసుగు చెందిన రైతు కొయ్యూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. రైతు తెలిపిన వివరాల ప్రకారం తనకున్న మూడున్నర ఎకరాల్లో వెన్ క్రాప్ సీడ్ మొక్కజొన్న పంటను వేశాడు. పంట వేసిన తరువాత కంపెనీ ప్రతినిధులు 4 నెలల తర్వాత వచ్చి కొనుగోలు చేసుకుని తీసుకెళ్తామని ఒప్పందం కుదుర్చుకొని ఐదు నెలలు కావస్తున్నా ఇప్పటికీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికే ఎకరానికి రూ. 50 వేలు ఖర్చు వచ్చిందని, పంటను తీసుకొని వెళ్లకపోతే తాను తీవ్రంగా నష్టపోతానని రైతు ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై స్థానిక వ్యవసాయ అధికారులకు కూడా సమాచారం ఇచ్చినట్లు తెలిపాడు. ఎవరూ స్పందించకపోవడంతో చివరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, తనకు న్యాయం చేయాలని రైతు వేడుకుంటున్నాడు.