- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘నా మాటే వేదం’.. ఆ పూజారి తీరుపై భక్తుల ఆందోళన

దిశ, ఉరవకొండ: ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మి నరసింహ దేవస్థానంలో ప్రధాన అర్చకుడిగా కొనసాగుతున్న పూజారి ద్వారక నాథ శాస్త్రి సిర చరాస్తులు అక్షరాల ఐదు కోట్లు. కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో 10 ఎకరాల భూమి ఉంది. అలాగే అత్యంత విలువైన విలాసవంతమైన ఇల్లు ఉంది. గత 40 సంవత్సరాలు ఆయన పెన్నోబలంలో ప్రధాన అర్చకులుగా కొనసాగుతున్నారు. ఐదు సంవత్సరాల క్రితం పదవి విరమణ చేశారు. ఓ టిడిపి నాయకుని ఆశ్రయించి తిరిగి పూజారిగా కొనసాగుతున్నారు. మిగతా పూజారులు జీతభత్యాలు అంతంత మాత్రమే అయితే ఇతనికి అధిక వేతనం పొందుతున్నారు.
ఈయనకు ఇచ్చే జీతంతో పోలిస్తే ఐదు మంది పూజారులు బతికేయచ్చు. అయితే రిటైర్డ్ అయిన పూజారిగా కొనసాగుతూ మిగతా పూజారులపై కర్ర పెత్తనం చెలాయిస్తున్నారు. ఇతనిపై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో లైంగిక వేధింపులపై భక్తులు ఈయన పై ఫిర్యాదులు చేశారు. దేవస్థానంలో ఆధిపత్య పోరు సాగుతోంది. ఈయన అల్ప వేతనాలు పొందుతున్న పూజారులను తన ఆధీనంలో ఉంచుకున్నారు. అర్చకుడు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉండడం పై అవినీతి నిరోధక శాఖ అధికారులచే విచారణ జరిపించాలని భక్తులు డిమాండ్ చేశారు. పూజారి మంత్రోచ్ఛారణ సరిగా లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. దంతాలు సరిగా లేనందున ఉచ్ఛరణ లోపంగా పూజలు చేస్తున్నారని భక్తుల ఆరోపించారు.
నా మాటే వేదం!
నా మాటే వేదం అన్న చందంగా పూజారి తీరు ఉంది నూతన రత నిర్మాణానికి రూ 15 లక్షలు గుడ్ విల్ గా తయారీ దారుణి తో డిమాండ్ చేయగా ఆయన ససేమిరా అన్నారు. పూజారికి 15 లక్షలు ఈవోకు 15 లక్షలు ఇచ్చుకోలేనని చేతులెత్తారు. ఇలాంటి అక్రమ సంపాదనలకు పూజారి తెరలేపి దిన దినంగా అవినీతి ప్రవర్ధమానంగా మారారు. వేలాది రూపాయలు దండుకుంటున్న మహా ప్రసాదం సుప్రభాత సేవలకు ఈయన దూరం అని భక్తులు నిట్టూర్పులు విడిచారు.
పదవీ విరమణ.. ముగిసిన!
పదవీ విరమణ ముగిసిన పూజారి తిరిగి ఉద్యోగంలో కొనసాగుతూ అంతు బొంతు లేని అక్రమ సంపాదనతో అటు భక్తులను ఇటు దేవస్థానంలో దోపిడీకి పాల్పడుతున్న పూజారిపై దేవస్థానం రాష్ట్ర ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.