ఈ విషయంపై త్వరలోనే ఆధారాలతో సహ బయట పెడతా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |
ఈ విషయంపై త్వరలోనే ఆధారాలతో సహ బయట పెడతా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: భూ కుంభకోణం గురించి త్వరలోనే అన్ని విషయాలు బయట పెడతానని జడ్చర్ల (Jadcharla) కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (Congress MLA Anirudh Reddy) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మ్యాన్‌హట్టన్‌ - వంశీరాం బిల్డర్స్ భూమి ప్రభుత్వానిదేనని వ్యాఖ్యానించారు. దీనిపై పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ఆర్టీఐ (RTI) కి కూడా దరఖాస్తు చేశానని, త్వరలోనే అన్ని వివరాలు ఆధారాలతో సహా బయటపెడతానని స్పష్టం చేశారు. మ్యాన్‌హట్టన్‌ -వంశీరాం బిల్డర్స్ భూమి రూ.10 వేల కోట్ల స్కామ్ (Scam) అని, గత ప్రభుత్వం (Previous Government) వంశీరాం బిల్డర్స్ కు 27 ఎకరాలు కట్టబెట్టిందని చెప్పారు. దీనిపై అప్పటి ఐఏఎస్ అమోయ్ కుమార్ (Amoy Kumar) పై అనుమానం ఉందని, ఆయన రియల్ ఎస్టేట్ కంపెనీలతో కుమ్మక్కయ్యారని అన్నారు.

ఇంత విలువైన భూమి విషయంపై బీఆర్ఎస్ (BRS) ఎందుకు మాట్లాడడం లేదని, ఆ రియల్ ఎస్టేట్ కంపెనీతో బీఆర్ఎస్ లాలూచీ ఏంటని ఎమ్మెల్యే ప్రశ్నించారు. అంతేగాక బీఆర్ఎస్ హయాంలో అక్కడ వంద ఫీట్ల రోడ్డు ఎందుకు వేశారో చెప్పాలన్నారు. హైడ్రా (Hydra)పై కేటీఆర్ (KTR) ట్వీట్ చేశారు. కానీ మ్యాన్ హట్టర్- వంశీరాం స్కామ్ పై ఎందుకు మౌనం వహిస్తున్నారని అనిరుధ్ రెడ్డి నిలదీశారు. కాగా గత కొద్ది రోజుల క్రితం మ్యాన్ హట్టర్ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హైడ్రాపై సంచలన ఆరోపణలు చేశారు. హైడ్రా నోటీసులు ఇచ్చి లావాదేవీలు నడిపిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయని, కబ్జాలపై ఫిర్యాదు చేసినా హైడ్రా సరిగ్గా స్పందించడంలేదని అన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడని, ఎమ్మెల్యేకే స్పందించకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని మండిపడ్డారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

Next Story