మరోసారి బర్డ్ ఫ్లూ విజృంభణ

by Naveena |
మరోసారి బర్డ్ ఫ్లూ విజృంభణ
X

దిశ, రేవల్లి: వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. మండల సమీపంలోని వైకుంఠ దామం దాటిన తర్వాత కెనాల్ కాలువలోని గుర్తు తెలియని వ్యక్తులు 500కు పైగా కోళ్లను అక్కడ పడేశారు. దీంతో అటుగా పోయేవారు వామ్మో చనిపోయిన కోళ్లు బర్డ్ ఫ్లూ వచ్చిందేమో అని భయభ్రాంతులకు గురవుతున్నారు. రేవల్లి మండల స్పెషల్ ఆఫీసర్, స్థానిక ఎమ్మార్వో లక్ష్మీదేవిని వివరణ కోరగా.. కొన్ని రోజుల కిందట కూడా ఇలాగే పడేస్తే వాటిని గొవ్వి తీసి పూడ్చి వేసామని అయినా కూడా మళ్లీ ఇలా పడేయడం ఇంతవరకు తమకు వరకు రాలేదని, వెంటనే చర్యలు తీసుకొని వాటిని గొవ్వి తీసి పూడ్చివేస్తామని ఆమె తెలిపారు.



Next Story

Most Viewed