- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మోసం, ఫోర్జరీ కేసులో ఆస్పత్రి డైరెక్టర్ అరెస్ట్
by Kalyani |

X
దిశ, గండిపేట్ : మోసం, ఫోర్జరీ కేసులో ఓ ఆసుపత్రికి చెందిన డైరెక్టర్‌ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల ప్రకారం.. మంచిరేవుల గ్రామంలోని ఆరోన్ హాస్పిటల్ బిల్డింగ్‌ను అక్రమంగా ఆక్రమించారని మహమ్మద్ గౌస్ ఉద్దీన్ కుమార్తె సనా ఫాతిమా పోలీసులను ఆశ్రయించింది. 2021లో అద్దె ఒప్పందం గడువు ముగిసినప్పటికీ, నిందితులు ఆసుపత్రి స్థలాన్ని ఖాళీ చేసేందుకు నిరాకరించారు. ఆమె తన అద్దెను మోసపూరితంగా పొడిగించేందుకు అద్దె దస్తావేజును ఫోర్జరీ చేసి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు సమర్పించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. సాక్ష్యాధారాల ఆధారంగా నార్సింగి పోలీసులు ఏలియమ్మ సెబాస్టియన్‌ను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు.
Next Story