ఇదేందయ్యా ఇదే.. మరీ ఇంత దారుణమా..

by Naveena |
ఇదేందయ్యా ఇదే.. మరీ ఇంత దారుణమా..
X

దిశ ,నిజాంసాగర్ : ఉపాధ్యాయుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట ప్రమాదకరంగా మారుతుంది. మండలంలోని అచ్చంపేట గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాసేందుకు గూడ్స్ ఆటోలలో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ఓవైపు ప్రతినిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటే.. మరోవైపు గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను చులకనగా చూస్తున్నారు. గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 76 మంది ఉండగా.. వారిని నిజాంసాగర్ మండల కేంద్రంలోని పదవ తరగతి పరీక్ష కేంద్రంతో పాటు గురుకుల పాఠశాలలో పరీక్ష వ్రాసేందుకు తీసుకు వస్తున్నారు.

అయితే ప్రమాదానికి చేరువలో ఉండే విధంగా గూడ్స్ ఆటోలో 40 మంది చొప్పున పరీక్షకు తీసుకువచ్చి.. పరీక్ష రాయించి తిరిగి గురుకుల పాఠశాలకు తీసుకు వెళ్తున్నారు. సోమవారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని పదవ తరగతి పరీక్ష కేంద్రంలో 38 మంది విద్యార్థులు పరీక్ష వ్రాసి ఎండలో గూడ్స్ ఆటోలో పశువులను కుక్కినట్టు కుక్కి తీసుకెళ్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Next Story

Most Viewed