గోడ కుర్చీతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

by Sujitha Rachapalli |
గోడ కుర్చీతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు స్కూల్ అంటే ప్రభుత్వ పాఠశాలలే.. చూపులతోనే హడలెత్తించే పెద్ద సార్.. ప్రేమగా ఉంటూనే తప్పులు ఎత్తి చూపే చిన్నసార్.. మాట జవదాటని విద్యార్థులు. చిన్న పిల్లల చేతిలో పలక.. పెద్ద పిల్లలు అయితే పుస్తకాలు. స్టూడెంట్ తప్పు చేస్తే రూల్ కర్ర, చింత బరిగెకు పనిజెప్పుడే.. గోడ కుర్చీ వేయించుడే. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. గంజాయి కొట్టొచ్చినా.. ఎందుకురా ఇట్లజేసినవ్ అంటే తప్పవుతుంది. రివల్స్‌లో వాడే బెదిరిస్తున్నడు. ఎక్కువ చేస్తే ఇంటికొచ్చి కొడుతా అని వార్నింగ్ ఇస్తున్నడు. ఇది తరం మారడం వల్ల వచ్చిన దౌర్భాగ్యం. ఎంతకు తెగించారంటే.. చదువు చెప్పే మేడమ్‌ను కూడా బాడీ షేమ్ చేసే దుస్థితి.

నిజానికి గోడ కుర్చీ తెలుగు వారు ప్రాచీన కాలంలో కనిపెట్టిన గొప్ప యోగాసనం. పంతుళ్లు విద్యార్థుల క్రమశిక్షణా చర్యల్లో వాడే దండనా పద్ధతి. దీనివల్ల పిల్లలు బుద్ధిగా ఉండటమే కాదు చక్కగా చదివేవారు కూడా. అయితే గోడకుర్చీతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని వివరించింది ఓ అధ్యయనం. ప్రతిరోజు క్రమం తప్పకుండా గోడ కుర్చీ వేస్తే రోగాలు దరిచేరవని చెప్పింది. ఇప్పుడు మారిన జీవనశైలి వల్ల 30ఏళ్లకే కాళ్లు, కీళ్ల నొప్పులు వచ్చేస్తున్నాయి. మోకాలు మార్పిడి, మోకాలు శస్త్రచికిత్స కోసం పెద్ద సంఖ్యలో పుట్టుకొచ్చిన ఆస్పత్రులే ఇందుకు నిదర్శనం. కాగా ఇవేవి రాకుండా లేకుండా ఉండేందుకు ఒకే ఒక చక్కని సొల్యూషన్ గోడ కుర్చీ అని చెప్తుంది అధ్యయనం.

ఈ తేలికైన ఆసనం చేసేందుకు ఎలాంటి ఎక్విప్మెంట్ అవసరం లేదు. ఓ గోడ చూసుకుని.. ఓ అడుగు ముందుకు నిలబడి.. కుర్చీ రూపంలో కూర్చోండి. గోడను ఆనుకుని ఉన్నా కుర్చీ మాదిరిగా మీ భంగిమ ఉండేలా జాగ్రత్త తీసుకోండి. ఇలా కాసేపు కదలకుండా, వణకుండా ఓ ఐదు నిమిషాలు ఉండేందుకు ప్రయత్నించండి. రోజులో ఓ ఐదు ఆరు సార్లు ఇలా చేస్తే బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయనడంలో సందేహమే లేదు. ఈ గోడ కుర్చీ మన బాడీలో లిపాంటిక్ అనే ఒక కెమికల్‌ను రిలీజ్ చేస్తుంది. రోగనిరోధక శక్తిని భారీగా పెంచుతుంది. శరీరంలో మంట(ఇన్‌ఫ్లమేషన్‌)ను కూడా తగ్గగిస్తుందని సైంటిఫిక్‌గా ప్రూవ్ అయింది. ముఖ్యంగా తొడ కండరాలు ఎంత బలంగా ఉంటే అంత మంచిది. అదిలేకే నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే దీనికి బెస్ట్ అప్రోచ్ గోడ కుర్చీ.

ఎలాగూ ఆఫీసులో గంటలు గంటలు కూర్చుని.. సరైన పోస్టర్ లేక అనేక రకాల వ్యాధులు తెచ్చుకుంటున్నాం. ఇలా కూర్చోవడం అనేది సిగరెట్ కాల్చడంతో సమానమని కొన్ని అధ్యయనాలు తేల్చేశాయి. కాబట్టి గంటలు గంటలు కూర్చునే మనం గంటకోసారి బ్రేక్ తీసుకుని గోడ కుర్చీ వేస్తే ముఖ్యంగా మనను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న నడుము నొప్పి నుంచి బయటపడొచ్చు. పొట్ట తగ్గే అవకాశముంది. తిన్నది సరిగ్గా జీర్ణం అయ్యేందుకు మద్దతిస్తూ మలబద్ధకం నుంచి ఉపశమనమిస్తుంది. ముఖ్యంగా కాళ్లు బలంగా ఉంటాయి. మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది. దీంతో క్రియేటివ్ థాట్స్ కూడా పెరిగే అవకాశముంది.

ఇక మరి ఇప్పుడు స్కూల్స్ ఎలా తయారయ్యాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. టీచర్ చేయి లేపితే చాలు పేరెంట్స్ గగ్గోలు పెట్టేస్తున్నారు. మా పిల్లాడిని గారాబంగా పెంచుకుంటుంటే మీరెలా చెయ్యేస్తారని కంప్లయింట్స్ ఇస్తున్నారు. వాడు కాస్త పెరిగి టీచర్‌నే కొట్టేంతగా నాశనమైపోతున్నాడు. ఒకప్పుడు నా కొడుకు తప్పు చేస్తే మీరే సరిదిద్దాలి అని గురువును అభ్యర్థించే తల్లిదండ్రులు ఉండేది కానీ ఇప్పుడు నా పిల్లాడు తప్పు చేస్తాడు అయితే మాత్రం కొడుతారా ఏంటని గురువు మీదకే గొడవకు పోతున్నారు. సమాజంలో గురువు గౌరవం ఇలా తగ్గిపోయింది కాబట్టే పిల్లలు చిన్నతనంలోనే వ్యసనాలకు బానిసవుతున్నారు. ఊహించని పరిణామాలు ఎదుర్కొంటున్నారు.

Next Story

Most Viewed