జంతువులను హతమార్చాలనుకొని తానే బలయ్యాడు

by Sridhar Babu |
జంతువులను హతమార్చాలనుకొని తానే బలయ్యాడు
X

దిశ‌,ఏటూరునాగారం : వ‌న్యప్రాణుల‌ను వేటాడడం కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ ఉచ్చుకు వ్యక్తి బలయ్యాడు. ఈ ఘ‌ట‌న ఏటూరునాగారం మండ‌లం చిన్న‌బోయినప‌ల్లి అట‌వీ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసుల క‌థ‌నం మేర‌కు ఏటూరునాగారం మండ‌ల కేంద్రానికి చెందిన‌ ఎద్దు లోకేష్‌, లోట‌పీట‌ల నారాయ‌ణ‌, తుమ్మ గంగ‌య్య అనే ముగ్గురు వ్య‌క్తులు శుక్ర‌వారం రాత్రి చిన్న‌బోయినప‌ల్లి గ్రామ స‌మీపంలోని అట‌వీ ప్రాంతంలో గ‌ల నిమ్మ‌తోట వ‌ద్ద వ‌న్యప్రాణులను వేటాడటం కోసం జే వైర్‌తో విద్యుత్ ఉచ్చు పెడుతుండ‌గా ప్ర‌మాదవ శాత్తు అదే ఉచ్చు తుమ్మ గంగ‌య్య అనే వ్య‌క్తికి త‌గిలి తీవ్ర‌గాయాల‌పాలై అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లాడు.

కాగా గంగ‌య్య మ‌ర‌ణించాడు అనుకొని లోకేష్‌, నారాయ‌ణ అక్క‌డి నుండి పారిపోయారు. కాగా న‌మ్మ‌ద‌గిన స‌మాచారం మేర‌కు ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లంకు వెళ్లి గాలించ‌గా అక్క‌డ శ‌రీరం మొత్తం కాలిపోయి గంగ‌య్య‌ అప‌స్మార‌క స్థితిలో ఉన్నాడు. బాధితుడిని సుమారు 2 కిలోమీట‌ర్లు పోలీసులు మోసుకొని వ‌చ్చి అనంతరం అంబులెన్స్​లో ఏటూరునాగారం సామాజిక ఆసుప‌త్రికి త‌ర‌లించి వైద్యం అందించారు. కానీ అప్ప‌టికే గంగ‌య్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో మెరుగైన వైద్యం నిమిత్తం వ‌రంగ‌ల్ ఎంజీఎం ఆసుపత్రికి త‌ర‌లించి వైద్యం అందిస్తుండ‌గా మృతి చెందాడు. మిగిలిన ఇద్ద‌రు వ్యక్తులు లోకేష్‌, నారాయ‌ణ‌ల‌ను పోలీసులు క‌స్ట‌డీలోకి తీసుకున్నారు.

Next Story