Neha Shetty: ‘పూర్తిగా హాస్యస్పదంగా ఉండటం మంచిది’.. హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Anjali |   ( Updated:2025-03-22 12:16:52.0  )
Neha Shetty: ‘పూర్తిగా హాస్యస్పదంగా ఉండటం మంచిది’.. హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ నేహాశెట్టి (Neha Shetty)గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. డీజే టిల్లు మూవీతో తెలుగులో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న ఈ బ్యూటీ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) డైరెక్షన్‌లో వచ్చిన మెహబూబా సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ మూవీలో ఆకాష్ కథానాయకుడిగా నటించి.. ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇండియా-పాక్ బోర్డర్ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీగా సాగే సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

భారతదేశం, పాకిస్తాన్ యుద్ధం కాలంలో మరణించిన ప్రేమ జంట తిరిగి ఈ కాలంలో జన్మించడం అనే స్టోరీతో దర్శకుడు రూపొందించాడు. ముఖ్యంగా ఈ సినిమా పూరి జగన్నాథ్ సొంత బ్యానర్‌లో నిర్మించడం విశేషం. తర్వాత ఈ బ్యూటీ డీజే టిల్లు మూవీతో ఓవర్ నైట్ ఫుల్ ఫేమ్ దక్కించుకుంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌(Sitara Entertainments Banners)పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

అలాగే డీజే టిల్లుకు విమ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda), ప్రిన్స్ సిసిల్, నేహాశెట్టి, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, ప్రగతి వంటి తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించి జనాల్ని తమ అద్భుతమైన యాక్టింగ్‌తో కట్టిపడేశారు. అనంతరం నేహా శెట్టి బెదురులంక, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari), గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, టిట్లు స్క్వేర్ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.

ఇకపోతే నేహాశెట్టి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ అమ్మడు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మంచి మాటలు రాసుకొచ్చింది. ‘‘అసంపూర్ణత అందం, పిచ్చి మేధావి అండ్ పూర్తిగా విసుగు చెందడం కంటే పూర్తిగా హాస్యస్పదంగా ఉండటం మంచిది’’ అని రాసుకొచ్చింది.

Next Story

Most Viewed