- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చెట్టును ఢీ కొట్టి బైక్.. వ్యక్తి మృతి

X
దిశ,సత్తుపల్లి: బైక్ పై వెళ్తూ మితిమీరిన వేగంతో చెట్టును ఢీ కొట్టిని లారీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన సత్తుపల్లి మండలం చెరుకుపల్లి గ్రామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన పత్తిపాటి వినోద్ కుమార్ (32) గత కొంతకాలంగా సత్తుపల్లి సింగరేణి బొగ్గు రవాణా లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో పత్తిపాటి వినోద్ కుమార్ మంగళవారం చెరుకుపల్లి గ్రామ శివారులో అడవి ప్రాంతంలో మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Next Story