- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
యాదగిరిగుట్ట ఎమ్మార్వో కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్..

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ యాదగిరిగుట్ట తహశీల్దార్ కార్యాలయాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నాయబ్ తహశీల్దార్, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కార్యాలయంలో సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధరణి పై సమావేశం నిర్వహించారు. ధరణి లో తప్పుడు రిపోర్ట్ పంపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సమయపాలన పాటించని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తహశీల్దార్ కార్యాలయంలో పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రిజిస్టేషన్ కి వచ్చిన రైతులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. మండల సర్వేయర్ వద్ద సర్వే కోసం ఉన్న అప్లికేషన్ లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కోర్టు రిజిస్టర్ ని పరిశీలించారు. కుల ధ్రువీకరణ, ఇతర సేవలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ వంటి సేవలను వెంటనే పరిష్కరించాలని, మీసేవ దరఖాస్తులు వెంట వెంటనే పరిష్కరించాలని సూచించారు. జంగంపల్లి గ్రామంలో కారోబార్ గ్రామానికి చెందిన కొంతమందిని భూములను వారి పేర్లను రికార్డు నుంచి తొలగించి కబ్జా చేశారని ఆరోపణలు ప్రజావాణిలో తన దృష్టికి వచ్చాయన్నారు. దీనిపై వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని ఆర్డీవోను ఆదేశించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆర్డీఓ విచారణ కొనసాగుతుందని విచారణ పూర్తి అయ్యి తనకు నివేదిక అందిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు.