- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చంద్రబాబు, పవన్ కల్యాణ్ నవ్వులపై MLC ట్వీట్

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ(Vijayawada)లోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే(MLA), ఎమ్మెల్సీ(MLC)లకు కల్చరర్ ప్రొగ్రామ్స్(Cultural Programs) నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమలోని టాలెంట్‌ను బయటపెట్టారు. దానవీరశూర కర్ణ సినిమాలోని ఎన్టీఆర్ డైలాగ్స్‌తో రఘురామ ఏకపాత్రాభినయం చేయగా, పల్నాటి బాలచంద్రుడి వేష ధారణలో మంత్రి కందుల దుర్గేష్ అదరగొట్టారు. అనంతరం యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరావులు చేసిన కామెడీ స్కిట్ అందరినీ తెగ ఆకట్టుకున్నది. అయితే, ఈ స్కిట్ చేస్తున్న సయమంలో సీఎం చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెగ నవ్వారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా వారి నవ్వులపై జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబు ట్వీట్ పెట్టారు.
‘ఆ రోజు శాసన సభలో రెస్పెక్టెడ్ సీఎం చంద్రబాబుకు జరిగిన ఇన్సల్ట్‌కు ఆయన కన్నీరు పెట్టటం ఎంత బాధించిందో.. ఈరోజు అదే శాసన సభలో నిర్వహించిన కల్చరల్ ఈవెంట్‌లో ఆయన మనస్పూర్తిగా నవ్వుతున్న దృశ్యం అంత ప్లెజెంట్‌గా అనిపించింది, అలాగే వర్క్ ప్రెషర్‌లో చాలా రోజులుగా నేను గమనిస్తున్న రెస్పెక్టెడ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మనస్ఫూర్తిగా నవ్విన నవ్వు చూసి నాకు చాలా సంతోషం వేసింది’ అని నాగబాబు(Naga Babu) పేర్కొన్నారు.
ఆ రోజు శాసన సభ లో రిస్పెక్టెడ్ సీఎం @ncbn గారికి జరిగిన ఇన్సల్ట్ కి ఆయన కన్నీరు పెట్టటం ఎంత బాధించిందో అదే ఈ రోజు శాసన సభ కల్చరల్ ఈవెంట్ లో ఆయన మనస్పూర్తి గా నవ్వుతున్న దృశ్యం అంత ప్లెజెంట్ గా అనిపించింది,అలాగే వర్క్ ప్రెషర్ లో చాలా రోజులుగా నేను గమనిస్తున్న రెస్పెక్టెడ్ డిప్యూటీ… pic.twitter.com/SoTdZhFjez
— Naga Babu Konidela (@NagaBabuOffl) March 21, 2025