మునగ సాగుతో అధిక లాభాలు : అదనపు కలెక్టర్ విద్యా చందన

by Kalyani |   ( Updated:2025-03-21 13:33:21.0  )
మునగ సాగుతో అధిక లాభాలు : అదనపు కలెక్టర్ విద్యా చందన
X

దిశ దమ్మపేట:- మునగ సాగు చేయడం ద్వారా అధిక లాభాలు సాధించవచ్చని అదనపు కలెక్టర్ విద్యా చందన రైతులకు సూచించారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట రైతు వేదికలో మునగ సాగుపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ విద్యా చందన మాట్లాడుతూ.. రైతులు మునగ సాగు చేయాలని కోరారు. ప్రస్తుతం మార్కెట్లో మునగ కాయలకు, ఆకులకు మంచి డిమాండ్ ఉందని ప్రతి ఒక్క రైతు తమ వ్యవసాయ భూముల్లో మునగ సాగు చేయాలని కోరారు. మునగ సాగు రైతులకు ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తుందని, సబ్సిడీతో పాటుగా కొనుగోలుదారులను కూడా నేరుగా తమ వద్దకే పంపి ఆ పంటను కొనుగోలు చేస్తుందని రైతులు ధైర్యంగా ముందుకు వచ్చి మునగ సాగు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రవీందర్ రెడ్డి, ఎంపీడీవో రవీందర్ రెడ్డి, హార్టికల్చర్ అధికారి సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed