- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రేవంత్ వి చిల్లర.. చీటర్.. బ్రోకర్ మాటలు : ఎర్రబెల్లి దయాకర్ రావు
దిశ, హనుమకొండ : రేవంత్ అన్ని చిల్లర, చీటర్, బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం హనుమకొండ లోని తన నివాసంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.. నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎర్రబెల్లి దయాకర్ రావు సీరియస్ అయ్యారు. “తెలంగాణలో కేసీఆర్ మొక్క మొలవనివ్వ అంటున్నావు, నువ్వు తెలంగాణలో ఒక గంజాయి మొక్కవు నిన్ను పీకి అవతల పారేస్తం అన్నారు. నీ స్వంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే నిన్ను పట్టించుకుంటాలేరు బిడ్డా, నిన్ను ఢిల్లీకి రానిస్తలేరు, 30 సార్లు ఢిల్లీకి పోయినా నీకు సోనియా, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేరు, మాకు తెలవదనుకున్నావ, నువ్వు మంత్రివర్గ విస్తరణ చేయలేని ఒక అసమర్దుడివి, నిన్ను సొంత పార్టీ నేతలే పట్టించుకొనే పరిస్థితి లేదు, రేవంత్ రెడ్డి అబద్ధాలు మోసపు మాటలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రని , రేవంత్ వి అన్ని చిల్లర, చీటర్, బ్రోకర్ మాటలని” అన్నారు.
నన్ను రాక్షసుడు అన్నావు, అవును నేను ప్రజల కోసం పనిచేసే రాక్షసున్నే, నా ప్రజల కోసం ఏమైనా చేస్తా అని అన్నారు. నేను ఏడు సార్లు గెలిచినా, నీకు ఒక్కసారి గెలిచిన చోట మరోసారి గెలిచిన చరిత్ర లేదు, నీ మాటలు నమ్మి ఓటేసిన ప్రతి ఒక్కరినీ మోసం చేసావు, అబద్దాలతో మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చాక కూడా నీ ప్రవర్తన మార్చుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఏం మాట్లాడుతున్నావో నీకైనా సోయి ఉందా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు.? ప్రజా విజయోత్సవ సభలు పెట్టడం కాదు ముందు నిన్ను నమ్మి నీకు ఓటేసి గెలిపించిన నీ నియోజకవర్గ ప్రజల సమస్యలు పట్టించుకో అని గుర్తు చేశారు. నువ్వు ఆనాడు తెలంగాణ బిడ్డల పై తుపాకీ తీసుకొని పోయి ఈరోజు తుపాకి రాముడు మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు ఏ పోరాటాలు చేసావో చెప్పు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావా, బాబ్లీ పోరాటంలో కూడా తప్పించుకుని తిరిగావు కదా ఆ విషయం మర్చిపోయావా రేవంత్ రెడ్డి , నీ సొంత లాభం కోసం ప్రతి ఒక్క పార్టీ మారే నువ్వా నా గురించి మాట్లాడేది, గెలిచిన చోట మళ్లీ గెలవలేని నువ్వు నా గురించి మాట్లాడడానికి సిగ్గుండాలని మండిపడ్డారు.
వరుసగా ఓటమి ఎరుగని నేతలు కేసీఆర్ కేటీఆర్, హరీష్ రావుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అన్నారు. నాడు మనతో పెట్టుకుంటే ఏ చావు చచ్చారని ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు, వైఎస్ఆర్ గురించి మాట్లాడిన నువ్వు ఈరోజు ఇందిరాగాంధీ జయంతి ఉత్సవాలు చేయడం నీతిమాలిన చర్యకు ఉదాహరణ అన్నారు. నాడు బలిదేవత 1200 మంది ప్రాణాలు తీసిన బలి దేవత బిరుదు ఇయ్యాలని సోనియాగాంధీని అన్న నువ్వు ఈ రోజు నా అమ్మ, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అమ్మ అనడానికి నోరు ఎట్లా వచ్చింది అన్నారు. ప్రజా పాలన అంటివి ప్రజలను గాలికి వదిలేసి నువ్వు మాత్రం గాలి మోటర్ లో ఎక్కి ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నావు అన్నారు. నాడు రాహుల్ గాంధీని వరంగల్ తీసుకువచ్చి వరంగల్ డిక్లరేషన్ అంటివి కదా ఎటు పోయింది ఆ డిక్లరేషన్ అని ప్రశ్నించారు.? నాడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం కబ్జా చేసిన మైదానంలో కనీసం 300 గజాల స్థలం అడుగుతే పట్టించుకోని మీరు కాళోజీ గురించి మాట్లాడే అర్హత లేదు అన్నారు.
కనీసం నీ మొహానికి కాళోజిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గాని చూసావా, కలిసావ అని మాట్లాడారు. నాటి మా ప్రభుత్వం కేసీఆర్ చొరవ వల్లనే ఈ కాళోజీ క్షేత్రం చాలా అద్భుతంగా తయారయింది, ఆనాడు కాళోజీ క్షేత్రం విశాలంగా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా కేసీఆర్ కట్టిస్తే ఈరోజు నువ్వు రిబ్బన్ కట్టింగ్గులు చేసి అంతా మేమే చేసాం అంటే చూసే ప్రజలకు తెలియదు ఎవరు చేసారని అన్నారు. నువ్వు ఆడబిడ్డలకి న్యాయం చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం అంటునావు కదా ముందు ఆడబిడ్డలకు ఇస్తానన్నరూ. 2500, బతుకమ్మ చీరలు,తులం బంగారం కేసీఆర్ కిట్టు, ఇచ్చి మాట్లాడు రేవంత్ రెడ్డి అని గుర్తు చేశారు. మహిళల సంక్షేమం కోసం కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు నాడు ఎన్టీఆర్ హయం లో మహిళా సంఘాలు చేస్తే వాటిని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసింది కేసీఆర్, ఇది కూడా తెలవకపోతే నువ్వే ముఖ్యమంత్రివి ఎలా అయ్యావు అని అన్నారు.
తెలంగాణ ప్రజలకు త్రాగు నీటి సమస్య ఉండకూడదని మిషన్ భగీరథ ద్వారా వేలకోట్ల ఖర్చుతో ఇంటింటికి త్రాగునీరు అందించింది మా ప్రభుత్వం, నీ పార్టీలో ఉన్న నీ ఎమ్మెల్యేలను ఎంత విలువ ఇస్తున్నారో నీ మీటింగ్ కు రాని స్థానిక ఎమ్మెల్యేను దొంతి మాధవ రెడ్డి ని చూస్తే తెలుస్తది నీ విలువ అని అన్నారు. నీలాంటోళ్లను చూసే ఆనాడు కాలేజీ మన ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాతిరేయ్యాలి, పరాయోడు మోసం చేస్తే పొలిమేరల వరకు కూడా తరిమికొట్టాలి అన్నాడు అని కాళోజీ వాక్యాలను గుర్తు చేశారు. నిన్ను పాతి పెట్టేందుకు యావత్ తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు తస్మాత్ జాగ్రత్త, ఇకనైనా నీ తీరు మార్చుకో ముఖ్యమంత్రి పదవికి ఉన్న గౌరవం పోగొట్టుకోకు అని తెలిపారు.
కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి పేద ప్రజలకు వటా వృక్షం లాంటి వ్యక్తి...
వరంగల్ ఎయిర్ పోర్ట్ కు 205 కోట్లు ఇచ్చి 2000 వేల కోట్ల దోపిడీకి రేవంత్ రెడ్డి తెరలేపారు అని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ ని విమర్శించే స్థాయి నీది, నీలాగా టీడీపీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాలన పక్షంలో వాటాలు తీసుకున్నట్లు తీసుకోమంటావా సీఎం, అంతే కాకుండా ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన కేటీఆర్, హరీష్ రావు కొట్లడుతుంటే వారిని విమర్శించే స్థాయి నీది అన్నారు. కేసీఆర్ ఈ తెలంగాణ ప్రజలకు వట వృక్షం లాంటి వాడు నీ జీవితం లో నువ్వు కేసీఆర్ తో పెట్టుకునే దమ్ము లేకనే ఇలా పనికిమాలిన విమర్శలు చేస్తున్నావు అంతేకాకుండా నగరానికి పట్టణానికి తేడా తెలువని రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడటం హాస్యాస్పదమని నరేందర్ పేర్కొన్నారు.
మహిళలకు సీఎం మోసం చేశాడు..
శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదన చారి..
మహిళలకు సీఎం మోసం చేశాడు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉందని, ఇంత చిల్లరగా మాట్లాడిన ముఖ్యమంత్రి మరొకరు లేరన్నారు. దేశాన్ని సుధీర్ఘంగా పాలించిన పార్టీకి అప్పులు, ఆస్తులు, ఆదాయం అంశాలపై ఎంతో అవగాహన ఉంటుంది. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, మంత్రులు సహకరించడం లేదు, నీ నియోజకవర్గం లో దారుణాలు జరుగుతున్నా వారిని పరామర్శించే ధైర్యం కూడా లేదన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో ఆశపడి జనాలు గోస పడుతున్నారు..
మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ...
“కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో ఆశపడి జనాలు గోస పడుతున్నారు. రైతులకు ఎలాంటి హామీలు ఇవ్వలేదు, కేసీఆర్ చేసిన కృషితోనే తెలంగాణ లో సాగు అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడారు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, మేము ఇచ్చిన నోటిఫికేషన్ కు పరీక్షలు నిర్వహించారు. కాళోజీ భవన్ ఇచ్చింది మేము, కాంగ్రెస్ ఏనాడూ కాళోజీ కాబోదన్నారు. నీకు దమ్ముంటే బెల్ట్, గుడుంబా కేంద్రాలను తగ్గిచన్నారు. వరంగల్ కు కేసీఆర్ ను తీసుకస్తాం ఇక్కడ నుంచే నీ భరతం పట్టడం ఖాయం అన్నారు.
వంద మంది రేవంత్ లు వచ్చిన కేసీఆర్ ను ఏం చేయలేరు..
మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్...
“వంద మంది రేవంత్ లు వచ్చిన కేసీఆర్ ను ఏం చేయలేరు. రేవంత్ రెడ్డి అధికార మదంతో మాట్లాడారు. నీ చిలిపి మాటలు, చేష్టలు ప్రజలు గమనిస్తున్నారు కేసీఆర్ ను నీ గురువులు, వైఎస్సార్ ఏం పీకలేకపోయారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే రేవంత్ పాలన సాగుతోంది, నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చు, ప్రజల భావాలకు అనుగుణంగా పాలన చేయాలన్నారు.
రేవంత్ రెడ్డి వీ తుపాకి రాముడు మాటలు..
మాజీ ఎమ్మెల్యే గండ్ర రమణ రెడ్డి...
రేవంత్ రెడ్డి తుపాకి రాముడు మాటలు మాట్లాడుతున్నారు. తుపాకీ జేబులో పెట్టుకుని తెలంగాణ లో తిరిగిన వాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాడు. ప్రజల ను మోసం చేస్తూ, కేసీఆర్ ను కొట్టడానికి సభ పెట్టిండు అన్నారు. అతి కొద్ది రోజుల్లోనే నీ పదవి పోతుంది, ప్రజలు తిరగ బడుతున్నారన్నారు.