అనుమతి లేని డెంటల్ క్లినిక్ సీజ్

by Kalyani |
అనుమతి లేని డెంటల్ క్లినిక్ సీజ్
X

దిశ, సంగారెడ్డి: అనుమతి లేకుండా నడుస్తున్న డెంటల్ క్లినిక్ కు వైద్యశాఖ అధికారులు సీజ్ చేశారు. సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డులో గల హ్యాపీ డెంటల్ క్లినిక్ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తుండడంతో సమాచారం అందుకున్న వైద్య శాఖ అధికారులు ఆసుపత్రికి చేరుకుని ఆసుపత్రిని సీజ్ చేశారు. అదేవిధంగా అదే డెంటల్ క్లినిక్ లో అనుమతి లేకుండానే ఫిజియోథెరపీ కేంద్రం కూడా అనుమతి లేకుండానే నిర్వహిస్తుండడం గుర్తించిన జిల్లా వైద్యశాఖ అధికారి గాయత్రి దేవి బుధవారం ఆసుపత్రిని సీజ్ చేశారు. జిల్లాలో ఎవరైనా ఎలాంటి అనుమతులు లేకుండా ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంఅండ్ హెచ్ఓ గాయత్రి దేవి హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed