ఖైదీల్లో సత్ప్రవర్తనకు చేస్తున్న కృషి అభినందనీయం

by Sridhar Babu |
ఖైదీల్లో సత్ప్రవర్తనకు చేస్తున్న కృషి అభినందనీయం
X

దిశ, ఖమ్మం రూరల్ : తెలంగాణలోని ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకొచ్చేందుకు జైలు అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని జైళ్ల శాఖ డీఐజీ సంపత్ అన్నారు. బుధవారం నగరంలో గల వెంకటేశ్వర ఫంక్షన్ హాలులో జైళ్ల శాఖ వరంగల్ రేంజ్ సిబ్బందికి రి-ట్రీట్-2024 కార్యక్రమం నిర్వహించారు. జిల్లా జైలు పర్యవేక్షణాధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. జైళ్ల శాఖ సిబ్బంది కోసం చేపట్టిన పలు ప్రగతి కార్యక్రమాలను వివరించారు. రి-ట్రీట్స్ చేపట్టడంతో సిబ్బందిలో కొత్త ఉత్సాహం నింపవచ్చన్నారు.

వారికి ఉన్న ఇబ్బందులు, ఉద్యోగ రీత్యా ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా వారితోనే చర్చించి వాటిని తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తారని తెలిపారు. ముద్దాయిలను సమాజానికి ఉపయోగకరమైన మనుషులుగా మార్చే ఆశ్రమాలుగా జైళ్లు మారాయని, విడుదలైన ముద్దాయిలకు ఉపాధి కల్పిస్తూ గొప్ప సంస్థలుగా తెలంగాణ జైళ్లు రూపొందాయని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ కేంద్ర కారాగారం పర్యవేక్షణాధికారి టి.కళాసాగర్, వరంగల్​, ఖమ్మం జిల్లా అధికారులు జి.విజయ్ డేని, జి. వెంకటేశ్వర్లు, ఏ.శ్రీధర్, జైలర్లు ఏ. సకృనాయక్, జి. లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed