మహిళా రిజర్వేషన్ బిల్లుపై అనుమానాలు: YS షర్మిల కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-09-19 13:22:45.0  )
మహిళా రిజర్వేషన్ బిల్లుపై అనుమానాలు: YS షర్మిల కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళా రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే చారిత్రక ఘట్టానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నామని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. మహిళా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం శుభపరిణామమని ఇవాళ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. జనాభాలో సగభాగమైన మహిళలు సమాన హక్కులు పొందే రోజు కోసం ఎదురుచూస్తున్నాని వెల్లడించారు. ఈ ఎన్నికల సమయంలో ఈ బిల్లు ప్రవేశపెట్టడంపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. రాజకీయ అవకాశవాదం కోసం కాకుండా ప్రజా శ్రేయస్సు కోసం పని చేయాలని సూచించారు. ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి మోడీ సర్కార్ ఇంత సమయం తీసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. దశాబ్దాలుగా పోరాడుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు.. రాజకీయాలకు అతీతంగా మనస్ఫూర్తిగా అందరూ మద్దతిద్దామని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story