- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BRS అంటే ‘బరాబర్ రైతు సావు కోరే పార్టీ’: YS షర్మిల ఘాటు విమర్శలు
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌ది ఒక రికార్డుల సర్కార్ అని, తొమ్మిదేండ్లలో రూ.14 వేల కోట్ల పంట నష్టం జరిగితే రైతులకు రూపాయి ఇవ్వకుండా రికార్డ్ సృష్టించారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల బుధవారం ట్విట్టర్ వేదికగా ఘాటు విమర్శలు చేశారు. అంతేకాకుండా 9 ఏండ్లలో 9 వేల మంది రైతులను బలి తీసుకోవడం కూడా ఒక రికార్డ్ అని అన్నారు. రుణమాఫీ అని చెప్పి ఎగ్గొట్టడంలోనూ బీఆర్ఎస్‌ది సరికొత్త రికార్డ్ అని ఎద్దేవా చేశారు. బ్యాంకుల వద్ద రైతులను దొంగలుగా చేసిన రికార్డ్ దేశంలో తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని సెటైర్లు వేశారు. ప్రజలకు మాట ఇచ్చి పంగనామాలు పెట్టడంలోనూ కేసీఆర్ ఆయనే సాటి అని షర్మిల విమర్శలు గుప్పించారు.
యాసంగి పంటను కొనకుండా కల్లాల వద్దే రైతులను కాటికి పంపుతున్న వ్యక్తి కేసీఆర్ అని ఆమె మండిపడ్డారు. రెండు నెలలైనా వడ్లు కొనడంలేరని, రోడ్లపై పడి ధర్నాలు చేస్తున్నా, ఐకేపీ సెంటర్ల ముందే పారబోసి ధాన్యాన్ని కాలబెడుతున్నా.. దొరకు చీమ కుట్టినట్లైనా లేదని షర్మిల విరుచుకుపడ్డారు. రైతులు అరిగోస పడుతున్నా.. ఒక రివ్యూ కూడా లేదని ధ్వజమెత్తారు. ధాన్యం కొనడం చేతకాక, రికార్డులు అని భజన చేయడం ఒక్కటే భజన బ్యాచ్‌కి తెలుసని బీఆర్ఎస్ నేతలపై పరోక్ష విమర్శలు చేశారు. అందుకే బీఆర్ఎస్ అంటే ‘బరాబర్ రైతు సావుకొరే పార్టీ’ అని ఆమె పేర్కొన్నారు. ఈ బందిపోట్లకు రైతు ఉసురు తాకుతుందని ఆమె శపించారు.