కాళేశ్వరంతో ఖజానా నింపుకున్నది KCR మాత్రమే.. దొరకు అది ఒక ATM: షర్మిల ఫైర్

by Satheesh |
కాళేశ్వరంతో ఖజానా నింపుకున్నది KCR మాత్రమే.. దొరకు అది ఒక ATM: షర్మిల ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పులు తీరాయని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల స్పందించారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా కేసీఆర్‌పై ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘రూ.1.49లక్షల కోట్లతో "కాళేశ్వరం తిప్పిపోతల పథకం" కట్టిన కేసీఆర్ గారు.. మూడేండ్లకే మునిగిన ప్రాజెక్టుతో రూ.80 వేల కోట్ల అప్పెట్ల తీర్చారు..?’’ అని ప్రశ్నించారు. ఎత్తిపోసిన 157 టీఎంసీలలో 100 టీఎంసీలను గోదావరిలో పోసినందుకు బాకీలు తీరాయా అని నిలదీశారు. ఎక్కడ చూసిన వరికుప్పలే కనిపిస్తున్నాయంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సైతం షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

లక్ష ఎకరాల సాగుకు దిక్కులేని ప్రాజెక్టుతో వడ్లు ఇసుక లెక్క పండినయా..? ప్రతి సీజన్‌లో పట్టుపని 40వేల ఎకరాలను కూడా తడపని ప్రాజెక్టుతో రైతులకు డబ్బులే డబ్బులా అని విమర్శించారు. మీరు పుట్టకపోతే తెలంగాణలో వ్యవసాయమే లేనట్లు.. ప్రాజెక్టు కట్టకపోతే రైతుకు దిక్కేలేనట్లు ఉంది మీ వ్యవహారం అని నిప్పులు చెరిగారు. మీ కమీషన్ల సౌదం కాళేశ్వరం అప్పులు తీర్చేది కాదని.. అప్పుల మీద అప్పులు మోపేదని సెటైర్లు వేశారు. తెలంగాణ నెత్తిన ఎప్పటికీ కాళేశ్వరం గుదిబండే అని విమర్శించారు.

రాష్ట్ర సొమ్మును వడ్డీలకు, నిర్వహణకు కాజేసే కన్నీటి సౌదం కాళేశ్వరమని.. ఆ ప్రాజెక్ట్ ముమ్మాటికీ కేసీఆర్ వైట్ ఎలిఫెంట్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో ఖజానా నింపుకున్నది కేసీఆర్ మాత్రమేనని.. అందుకే దొరకు కాళేశ్వరం ఒక ఏటీఎం అని విమర్శల వర్షం కురిపించారు. దేశంలోని రైతులకు ఉన్న అప్పుల్లో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని.. అదే రైతుల ఆదాయంలో తెలంగాణ 25వ స్థానంలో ఉందని.. ఇవి పార్లమెంటులో కేంద్రం చెప్పిన వివరాలేనని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed