- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిజామాబాద్ ఆస్పత్రి ఘటనపై స్పందించిన షర్మిల.. కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: నిజామాబాద్ ఆసుపత్రిలో రోగిని నేలపై లాక్కుని తీసుకెళ్లడంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఫైరయ్యారు. ఆరోగ్య తెలంగాణ అంటే ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. రోగులను నేలపై లాక్కొని వెళ్లడమే కార్పొరేట్ వైద్యమా? అని నిలదీశారు. స్ట్రెచర్లు, వీల్ చైర్లు లేకపోవడమే వసతుల కల్పనా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఏటా రూ.11 వేల కోట్ల బడ్జెట్ అంటూనే.. రోగికి వీల్ చైర్ కూడా అందించలేని దరిద్రపు పాలన కేసీఆర్‌ది అని ఆమె ధ్వజమెత్తారు. ఇది ఆరోగ్య తెలంగాణ కాదని, ప్రజలు చూస్తున్న అనారోగ్య తెలంగాణకు నిదర్శనం నిజామాబాద్ ఘటన అని ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి దళితుల అభివృద్ధికి రూ.1.13లక్షల కోట్లు ఖర్చు చేస్తే ఆ నిధులన్నీ ఎక్కడికి పోయినట్లని ఆమె ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష కోట్లు బొక్కినట్లు.. దళితుల పేరు చెప్పి మరో లక్ష కోట్లు మింగావా? అని ప్రశ్నించారు. నిజంగా లక్ష కోట్లు ఖర్చు చేస్తే దళితులకు మూడెకరాల భూమి ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. 19 లక్షల దళిత కుటుంబాలుంటే 32 వేల కుటుంబాలకే దళితబంధు ఇచ్చి ఎందుకు చేతులు దులుపుకున్నట్లని నిలదీశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఎందుకు ఇవ్వలేదని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నలవర్షం కురిపించారు. తెలంగాణలో కేసీఆర్ మాటలు నమ్మే రోజులు పోయాయని చురకలంటించారు. రాష్ట్రంలో లక్ష మందికి కూడా దళితబంధు ఇవ్వలేని వ్యక్తి దేశంలో ఏటా 25 లక్షల మందికి ఇస్తాననడంపై ఆమె సెటైర్లు వేశారు.