- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ చేతకాని దద్దమ్మ అంటూ.. వైఎస్ షర్మిల ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ చేతకాని దద్దమ్మ అని, చేతకాని దద్దమ్మలా ఫామ్ హౌజ్ కే పరిమితమై ప్రధాని వెళ్లిపోయాక అవాకులు, చెవాకులు పేల్చడం సీఎంకు అలవాటుగా మారిందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఫైరయ్యారు. ప్రధాని మోడీ తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రం సమస్యల పరిష్కారానికి ఎదురుచూస్తోందని ఆమె ట్విట్టర్ వేదికగా చెప్పారు.
తొమ్మిదేండ్లు కావొస్తున్నా విభజన హామీలు నెరవేర్చకపోవడం బాధాకరమని ఆమె వెల్లడించారు. బడ్జెట్‌లోనూ తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు లేవని షర్మిల మండిపడ్డారు. ఈ సభలోనైనా తెలంగాణకు నిధులు ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటీఎంలా మారిందని బీజేపీ లీడర్లు బుకాయిస్తున్నా.. ఎంక్వైరీ చేయడం లేదని షర్మిల విమర్శలు చేశారు.
కాళేశ్వరం అవినీతిపై తమ పార్టీ తరుపున ఢిల్లీకి వెళ్లి పోరాటం చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. కాగ్, సీబీఐకి ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ఫైరయ్యారు. రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ ప్రజల సొమ్మును పణంగా పెట్టడం విచారకరమని, ప్రధాని రాష్ట్రానికి వస్తే ఎదురెళ్లి సమస్యలు పరిష్కరించండి అని నిలదీసే దమ్ము దొరకు లేకపోయిందని షర్మిల ఘాటు విమర్శలు చేశారు. దొర రాజకీయాలు, మొండివైఖరితో తెలంగాణకు అన్యాయమే జరుగుతోందని షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు.