- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్క రాజకీయ పార్టీకి రెండు ఆఫీస్‌లా.. కేసీఆర్‌పై షర్మిల సీరియస్
దిశ, తెలంగాణ బ్యూరో: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్న చందంగా సీఎం కేసీఆర్ రాజకీయాలకు భూములు కరువా? అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కమీషన్ల పేరు చెప్పి ఖజానానే కేసీఆర్ పొతం పట్టించారని పేర్కొన్నారు. సర్కారు భూములను సైతం వదలడం లేదని, ఏదో ఒక పేరు చెప్పి కారు చౌకగా భూములు కాజేస్తున్నారని ఆరోపించారు. 15 అంతస్తుల భారత్ భవన్, ఎక్స్ లెన్స్ సెంటర్ పెడతాడట.. ఒక రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీకి రెండు కార్యాలయాలా..? అని నిలదీశారు. పార్టీ పేరు మార్చినంత మాత్రానా.. కొత్త భవనానికి సర్కారు భూమి ఇవ్వడమా..? అని ప్రశ్నించారు. రూ.550 కోట్లు పలికే 11 ఎకరాల స్థలం రూ. 37 కోట్లకే కొట్టేయడమా? అని ప్రశ్నించారు.
దొర రాజకీయాలకు అగ్గువకే దొరికే సర్కారీ భూములు పేదల సంక్షేమానికి మాత్రం కనపడవని సీఎంను విమర్శించారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వడానికి, 36 లక్షల మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టడానికి, అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు భూములు ఉండవని నిలదీశారు. చివరికి జర్నలిస్టులకు ఇవ్వడానికి స్థలాలు దొరకవన్నారు. కానీ, దొర విలాసాలకు, పార్టీ కార్యాలయాలకు, ఎక్స్ లెన్స్ సెంటర్లకు మాత్రం అడగంగానే భూములు దొరుకుతాయని వివరించారు. రాత్రికి రాత్రే దొంగ జీవోలు, బదలాయింపులు జరిగిపోతాయన్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని దొర ఆడిందే ఆట.. పాడిందే పాట.. అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను షర్మిల విమర్శించారు.
Also Read..
బతుకులు మారాలంటే.. తెలంగాణలో మరో ఉద్యమం జరగాల్సిందే: YS షర్మిల