- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BRS MLA శంకర్ నాయక్‌కు షర్మిల సవాల్
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రవాళ్లు నోటికి వచ్చనట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, కనుసైగ చేస్తే చాలు తమ పార్టీ కార్యకర్తలు తరిమి కొడతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలకు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల కౌంటర్ ఇచ్చారు. 'ఏది సైగ చెయ్.. ఈ శంకర్ నాయక్‌కు రాజశేఖర్ రెడ్డి బిడ్డ సవాల్ చేస్తున్నది. ఎవడొస్తాడో రండి. ఏ దాడి చేస్తాడో చేయండి. మీ లాంటి జేజమ్మలను చూసిన దాన్ని నేను. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేదాన్ని కాదు' అంటూ విరుచుకుపడ్డారు.
శుక్రవారం మహబూబాబాద్ జిల్లా నెళ్లికుదురు మండల కేంద్రంలో మాట్లాడిన షర్మిల.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై మాటలతో ఎదురుదాడి చేశారు. మరో వైపు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎర్రబెల్లి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఆడవాళ్లయితే మనుషులు కాదా? అన్యాయాలు, అక్రమాలపై ప్రశ్నించకూడదా అని నిలదీశారు. ఎర్రబెల్లిపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని, ఎర్రబెల్లి సుద్ద పూసవైతే పబ్లిక్ ఫోరమ్ పెట్టి నిరూపించుకోవాలన్నారు.