యువత రాజకీయాల్లోకి రావాలి : వెంకయ్య నాయుడు

by Sathputhe Rajesh |
యువత రాజకీయాల్లోకి రావాలి : వెంకయ్య నాయుడు
X

దిశ, హన్మకొండ: యువత రాజకీయాల్లోకి రావాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. హన్మకొండలోని చైతన్య డీమ్డ్ బి యూనివర్సిటీ (సి. డి. సి)లో నిర్వహించిన 11వ స్నాతకోత్సవ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. బుల్లెట్ కన్నా బ్యాలెట్ గొప్పది అన్నారు. నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేస్తూ ముందుకు వెళ్తే కష్టమైన విజయం నీ ముందు ఉంటుందన్నారు.

సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి చదివితే విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరు నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని సన్మార్గం ద్వారా పయనిస్తూ ముందుకు వెళ్లాలని చెప్పారు. మన సంస్కృతిని కాపాడుకుంటూ మహానీయుల ఆశయాలను నెరవేర్చడంలో ముందుకు సాగాలన్నారు. మాతృ భాషతో పాటు ఇంగ్లీషును నేర్చుకోండన్నారు.

తెలుగును భాషగా చూడొద్దన్నారు. విద్యావ్యాపారం కాకూడదని తెలిపారు. విద్యార్థిని విద్యార్థులకు మంచి భవిష్యత్ అందిచే దేవాలయాలు యూనివర్సిటీలు కావాలని కాంక్షించారు. విద్య ,ఉపాధి, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళండి కానీ కన్నా తల్లి దండ్రులను కుటుంబ సభ్యులను మరిచిపోవద్దన్నారు. అనంతరం 254 మంది విద్యార్థిని విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. వీరిలో కె.వైష్ణవి, ఆర్.అహలాద, ఎస్.హెచ్.జినత్ సుల్తానా, పి.అమూల్య, బి.నవ్యశ్రీ, డి.వైష్ణవిలు బంగారు పథకాలు పొందారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఐటి డైరెక్టర్ రమణ రావు, మాజీ మంత్రి ఇనుగాల పెద్ది రెడ్డి, కళాశాల చైర్మన్ పురుషోత్తం రెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed