భక్తులకు బిగ్ షాక్.. యాదాద్రి ఆలయ అధికారులు కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-22 13:21:21.0  )
భక్తులకు బిగ్ షాక్.. యాదాద్రి ఆలయ అధికారులు కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి ఆలయ(Yadadri Temple) అధికారులు భక్తులకు షాకిచ్చారు. ఇక నుంచి ఆలయంలో ఫొటోలు, వీడియోలు తీయడాన్ని నిషేదించారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో భాస్కర్ రావు(EO Bhaskar Rao) మంగళవారం అధికారికంగా ప్రకటించారు. కాగా, తెలంగాణలోని పుణ్యక్షేత్రాల్లో యాదాద్రి ఆలయం అతి ముఖ్యమైనది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దీనిని నిర్మించారు. రోజూ దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.

ఈ నేపథ్యంలో జ్ఞాపకంగా ఉంటాయని ఫొటోలు, వీడియోలు తీసుకుంటుంటారు. దీంతో ఆలయ ప్రతిష్టకు భంగం కలగకుండా, భక్తుల మనోభావాలు, విశ్వాసానికి ఆటంకం ఏర్పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. అయితే, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు మాఢవీధుల్లో ఫ్యామిలీ ఫొటోలు దిగితే తమకేం అభ్యంతరం లేదని తెలిపారు. ఇదిలా ఉండగా.. యాదగిరిగుట్టపై ఉన్నటువంటి అర ఎకరం స్థలాన్ని 4.03 ఎకరాలకు విస్తరించి ఆలయ నిర్మాణం చేశారు. ఇందుకు నాటి ప్రభుత్వం దాదాపు రూ.1200 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed