- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వామ్మో.. మూడు నెలలు! జంకుతున్న బీఆర్ఎస్ అభ్యర్థులు
దిశ, తెలంగాణ బ్యూరో: మూడునెలల ముందే కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడంతో వచ్చేదంతా పండుగల సీజన్ కావడంతో పోటీచేసే అభ్యర్థులు జంకుతున్నారు. గణేష్ నవరాత్రులతో పాటు బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలు ఉండడంతో భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. లేకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో నెగిటివ్ గా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉండటంతో లోకల్ ప్రజలను ఖుష్ చేయాలంటే ఖర్చు చేయాల్సిందే. మళ్లీ ఎన్నికలకు అదనంగా ఖర్చు కానుండటంతో తలచుకొని అభ్యర్థులు గుబులు పడుతున్నారు. ఈ మూడు నెలలే కీలకం. ఎవరైతే ఖర్చుకు వెనుకాడకుండా ఉండి నిత్యం ప్రజల్లో ఉంటారో వారికే ప్రజల మద్దతు లభించే అవకాశం ఉంటుంది.
కేడర్‌ను ఖుషీ చేయాలంటే కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. డబ్బుల విషయంలో వెనుకంజ వేసే అభ్యర్థులకు మాత్రం గడ్డుకాలమే ఎదురుకానుంది. కొందరు ఖర్చు చేసినా అదృష్టాన్ని పరిక్షించుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. పండుగలకు చేసే ఖర్చు ఒక ఎత్తయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాకా భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే హుజూరాబాద్, మునుగోడు బైపోల్ తో భారీగా ఖర్చు చేశారు. ఓటర్లకు సైతం నగదు పంపిణీ చేసిన సందర్భాలున్నాయి. ప్రభుత్వం ఎన్నిచేసినా పోలింగ్ కు ముందు ఓటర్లను ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఈ కారణాలతో అభ్యర్థులు జంకుతున్నారు.
ఆదాయ మార్గాల్లో అభ్యర్థులు నిమగ్నం
ఎన్నికల వ్యయానికి అవసరమయ్యే డబ్బుమూటల వేటకు సన్నద్ధమవుతున్నారు. అభ్యర్థులు తమకు బాకీలు ఉన్నవారి వద్ద వసూళ్లు, స్థిరాస్తుల అమ్మకాలు, అప్పులు తెచ్చుకోవడం, విరాళాలతో పాటు అన్నిమార్గాలను అన్వేషించి డబ్బులు పోగు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే సొంత ఎజెండాను సైతం రూపొందించుకుంటున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే అన్నింటినీ చక్కదిద్దే పనిలో పడ్డారు. ఒకవైపు పార్టీ కార్యక్రమాలతో పాటు మరోవైపు నిధుల సేకరణపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇప్పటి నుంచి ఖర్చుకు వెనుకాడకుండా ఉండేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. అందుకు అభ్యర్థులు నమ్మకమైన వ్యక్తులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు.
Also Read: చినజీయర్‌తో సయోధ్య.. హిందూ ఓటు బ్యాంకు టార్గెట్‌గా కేసీఆర్ బిగ్ స్కెచ్!