- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చాక్లెట్ డే రోజే.. చేదు అనుభవం! అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ వద్ద ఘటన
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో ఓ వ్యక్తికి చాక్లెట్ డే రోజే చేదు అనుభవం ఎదురైంది. ఇష్టపడి తెచ్చుకున్న క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్లో 'బతికున్న' పురుగు వచ్చింది. దీంతో ఆయన షాక్‌కు గురయ్యారు. దీనికి సంబంధిచిన వీడియో తాజాగా వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. రాబిన్ అనే ప్రయాణికుడు అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న రత్నదీప్ స్టోర్ నుంచి ఒక డెయిరీ మిల్క్ చాక్లెట్ కొనుగోలు చేశాడు. దాన్ని ఓపెన్ చేస్తే బతికున్న పురుగు కనిపించింది.
ఆ పురుగు చాక్లెట్‌పై పాకుతూ తిరుగుతుంది. వెంటనే అతను వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి.. జీహెచ్ఎంసీ, డెయిరీ మిల్క్ కంపెనీ, రత్నదీప్ సుపర్ మర్కెట్‌కు కంప్లైంట్ చేశారు. ఈ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారు? అని ప్రశ్నించారు. కొనుగోలు చేసిన బిల్లు సైతం ఆయన పోస్ట్ చేశారు. దీంతో జీహెచ్ఎంసీ స్పందించింది. వెంటనే విచారణకు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఆఫ్ జీహెచ్ఎంసీ ఆదేశాలు ఇచ్చింది.
ఈ ఘటనపై నెటిజన్లు స్పందిస్తున్నారు. జీహెచ్ఎంసీకి కంప్లైంట్ ఇచ్చిన కూడా వేస్ట్ అని, పట్టించుకోరని నెటిజన్లు విమర్శిస్తున్నారు. మరి కొంత మంది పురుగు ప్రోటీన్ ఫుడ్ అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.