తప్పు చేస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ని కూడా నిలదీస్తా.. బీఎస్పీ యంగ్ లీడర్ దాసరి ఉషా

by Mahesh |   ( Updated:2023-10-10 15:42:56.0  )
తప్పు చేస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ని కూడా నిలదీస్తా.. బీఎస్పీ యంగ్ లీడర్ దాసరి ఉషా
X

దిశ, డైనమిక్ బ్యూరో: తప్పు చేస్తే బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్పీ కూడా నిలదీస్తా అని తెలంగాణ బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి ఇన్‌చార్జ్ దాసరి ఉషా దిశ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇతర పార్టీలో మనం నాయకత్వాన్ని ఏదైన ప్రశ్నిస్తే అణిచివేతకు గురి చేస్తారని, మన కష్టాలు కూడా పట్టించుకోరని, బీఎస్పీలో మహిళలకు చాలా ఫ్రీడం ఉంటుందని చెప్పారు. రైతులకు మహిళలకు, యువతను అభివృద్ధి చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను.. ఐఐటీ చదివి ఆ ఫీల్డ్ లోకి వెళ్లకుండా పాలిటిక్స్‌లోకి వచ్చానని తెలిపారు.

రాజకీయంలో గుండయిజం, దోపిడీ, రాచరిక పాలన మార్చాలంటే యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన ఉద్యమం పట్టుదలతో ముందుకు తీసుకు వెళుతున్నారు.. కాబట్టి ఆయన నాయకత్వంలో పనిచేయాలనుకున్నట్లు వెల్లడించారు. అందుకే బీఎస్పీలో చేరాను.. సోసైటీ మరుస్తారని ఆర్ఎస్పీని బలంగా నమ్ముతున్నాని చెప్పుకొచ్చారు.

కొంత మంది రాజకీయంలో ఉన్నాకూడా ‘నాకేంటి’ అని అడుగుతున్నారు. కొంతమంది పైసలతోనే బహుజన రాజ్యాన్ని స్థాపించ గలం అని అనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ల దగ్గర ఒక గన్ తీసుకపోయి మాట్లాడాలని అనిపిస్తుందని మండిపడ్డారు. తాను పాలిటిక్స్‌లోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుందన్నారు. బహుజన తెలంగాణ ఏర్పాటే లక్ష్యమన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ లెక్క ఎన్నికలు, సభల సమయంలో.. ఎవ్వరికి బీరు, బిర్యానీ పొట్లాలు ఇవ్వమన్నారు. మేము ఉదయం లేచినప్పటి (నిద్రలో కూడా) నుంచి మనువాదాన్ని వ్యతిరేకిస్తామని, బీజేపీ మత రాజకీయం చేస్తుందని, అందుకే బీజేపీకి వ్యతిరేకమన్నారు. కాంగ్రెస్ ను యూపీలో తొక్కి పడేశాం.. కాబట్టి బీజేపీకి బీ టీం అని కాంగ్రెస్ ప్రచారం చేస్తుందని విమర్శించారు. తెలంగాణలో దొరల పార్టీ నుంచి విముక్తి కావాలని దిశ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ధర్మ సమాజ్ పార్టీ (డీఎస్పీ ) అనేది మొన్న మొన్న వచ్చిందన్నారు. బీఎస్పీ అనేది నేషనల్ పార్టీ, డీఎస్పీ అనేది స్టేట్ పార్టీ అయినా ఆ పార్టీ ఎక్కడ కూడా పోటీ చేయలేదు.. బీఎస్పీకి డీఎస్పీ సవాల్ విసరడం ముర్ఖత్వమన్నారు. బీఎస్పీ అనేది ఒక సముద్రమని, దీంట్లో డీఎస్పీ అనేది చిన్న కాలువ అని విమర్శించారు. ఏదో ఒక నాడు బీఎస్పీ సముద్రంలో డీఎస్పీ కలుస్తదని చెప్పుకోచ్చారు.

Advertisement

Next Story

Most Viewed