Wine cake : వైన్ కేక్ తయారీ షురూ...క్రిస్మస్ వేడుకల స్పెషల్

by Y. Venkata Narasimha Reddy |
Wine cake : వైన్ కేక్ తయారీ షురూ...క్రిస్మస్ వేడుకల స్పెషల్
X

దిశ, వెబ్ డెస్క్ : క్రిస్మస్(Christmas) వేడుకలు సమీపిస్తున్నాయి. క్రైస్తవ సోదరులు అట్టహాసంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకలకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. క్రిస్మస్ వేడుకల్లో ఎక్కువగా రకరకాల కేక్ ల సందడి కనిస్తుంటుంది. చిన్నాపెద్ద తేడా లేకుండా క్రిస్మస్ కేకును కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటారు. క్రిస్మస్ కేక్ లలో వైన్ కేక్(Wine cake) క్రేజ్ అంత ఇంతా కాదంటారు. ఆ కేకు కట్ చేస్తే కానీ క్రిస్మస్ జరిపినట్లు కాదనే భావన దాదాపు అందరు క్రిస్టియన్లలో ఉంటుంది. వైన్ కేక్ రుచి మామూలు కేకులకు భిన్నంగా అద్భుతంగా ఉంటుంది. దాని తయారీ సాదాసీదాగా ఉండకపోవడమే దాని అద్వితీయమైన రుచికి కారణం. కనీసం రెండు నెలల ముందుగా కేకును తయారుచేయడం మొదలుపెడతారు. క్రిస్మస్ కేకు తయారుచేయడం కూడా ఒక ప్రసిద్ధి చెందిన సాంప్రదాయంగా శతాబ్దాల నుండి కొనసాగుతోంది. దీన్ని కేక్ మిక్సింగ్ సెరెమొనీ అంటారు.

హైదరాబాద్ నగరంలో లక్డీకపూల్‌లోని అశోక హోటల్‌లో వివిధ రకాల డ్రై ఫ్రూట్స్, దేశీయ మద్యం, ఖరీదైన వైన్‌ను ఉపయోగించి వైన్ కేక్‌ తయారీని ప్రారంభించారు. కేక్ మిక్సింగ్‌ను డిసెంబర్ రెండో వారం వరకు నానబెట్టి, చివరగా కేక్ తయారీని ప్రారంభిస్తామని హోటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ తేజస్విని రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ జావేద్‌లు తెలిపారు. అటు ప్రసిద్ధ నోవాటెల్ హోటల్ సహా బడా హోటళ్లలో ఈ తరహా కేక్ మిక్సింగ్ సెరెమొనీ చేపట్టారు.

Advertisement

Next Story