రాష్ట్ర రాజధాని నడిబొడ్డున జరిగిన సంఘటనలపై మహిళా మంత్రులు ఎందుకు స్పందించలేదు: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

by Mahesh |   ( Updated:2024-08-17 08:37:42.0  )
రాష్ట్ర రాజధాని నడిబొడ్డున జరిగిన సంఘటనలపై మహిళా మంత్రులు ఎందుకు స్పందించలేదు: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని.. వరుసగా జరుగుతున్న సంఘటనలే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అన్నారు. అలాగే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని మలక్ పేట లో అంధ విద్యార్థి మీద జరిగిన సంఘటనపై ఆ ఇద్దరు మహిళా మంత్రులు ఎందుకు స్పందించలేదని ఆమె ప్రశ్నించారు. గత 8 నెలలుగా రాష్ట్రంలో 1800 మహిళలపై ఇలాంటి సంఘటనలు జరిగాయని.. మరి అప్పుడు ఎందుకు స్పందించలేదని.. ఇది పోలీసు శాఖ ఇచ్చిన సమాచారమేని.. వీటన్నింటిపై మహిళా మంత్రులుగా ఉన్న వారు ఎందుకు స్పందించలేదని అన్నారు. కేవలం రాజకీయం చేయడం కోసమే కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతున్నారని.. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

Advertisement

Next Story

Most Viewed