చెవిలో పూలు పెడుతన్న కేసీఆర్.. మళ్ళీ వారికి అవకాశం ఎందుకివ్వాలి?: ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్

by sudharani |   ( Updated:2023-06-27 10:08:21.0  )
చెవిలో పూలు పెడుతన్న కేసీఆర్.. మళ్ళీ వారికి అవకాశం ఎందుకివ్వాలి?: ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు చెవిలో పువ్వులు పెడుతున్నారని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ విమర్శించారు. కేసీఆర్ వందలో ఒకటి కూడా నిజం మాట్లాడరని, అబద్దం చెప్పేవాళ్ళకు ఆయన జనకుడు అని పేర్కొన్నారు. ఆంధ్రలో వంద ఎకరాలు.. తెలంగాణలో ఒక ఎకరంతో సమానమని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాడని అన్నారు. ఈ మేరకు కేఏపాల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తనకు విశాఖలో ఒక ఎకరం ఉందని అది రెండు కోట్ల విలువ ఉంటుందని, విజయనగరంలో తనకు 20 ఎకరాలు ఉన్నాయని దాని విలువ ఒక ఎకరానికి రెండు కోట్లు పలుకుతుందన్నారు.

తెలంగాణ సంగారెడ్డి దగ్గర ఒక ఎకరం 50 లక్షలు మాత్రమే అని అన్నారు. ఇంకా ఆంధ్రాలోని విశాఖ విజయనగరం జిల్లాలలో ఒక ఎకరం పది కోట్లు, 20 కోట్లు పలుకుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ దేశాన్ని సర్వనాశనం చేసిందే గాంధీ కుటుంబమని ఆరోపించారు. కాంగ్రెస్‌కు 60 ఏళ్లు అవకాశం ఇచ్చామని మళ్ళి అవకాశం ఎందుకివ్వాలని ప్రశ్నించారు. అదానీ, అంబానీ లాంటి వందల మందిని కుబేరులను చేసిందే గాంధీ కుటుంబీకులే అని అన్నారు. సోనియా గాంధీ ఒక విదేశీ ఎజెంట్ అని, తన పీస్ మిషన్‌ను ఆమె క్యాన్సల్ చేసీ.. దేశాన్ని సర్వనాశనం చేసిందన్నారు. ఈ కుటుంబ అవినీతి పాలనను అంతం చేద్దామని కేఏపాల్ పిలుపునిచ్చారు.

Read More..

తెలంగాణ ప్రజల చెవిలో పూలు పెడుతున్న కేసీఆర్: KA Paul

రాష్ట్ర ప్రజల సొమ్ముతో పక్క రాష్ట్రంలో సోకు రాజకీయాలు.. సీఎం కేసీఆర్ పై వెఎస్ షర్మిలా రెడ్డి విమర్శలు

Advertisement

Next Story