KTR : నిజాలను ప్రభుత్వం ఎందుకు దాస్తున్నది : కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

by Ramesh N |
KTR : నిజాలను ప్రభుత్వం ఎందుకు దాస్తున్నది : కేటీఆర్ ఆసక్తికర పోస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య పరిస్థితి అధ్యయనం చేయడానికి నిపుణులైన డాక్టర్లతో త్రిసభ్య కమిటీ వేశామని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. మాజీ ఆరోగ్య మంత్రి డాక్టర్ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో నిజనిర్ధారణ బృందాన్ని బీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిందన్నారు. అయితే గాంధీ హాస్పటల్‌కు వెళ్తున్న ఆ త్రిసభ్య కమిటీని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.

నిజాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దాచి పెడుతోందని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా నిజాలను దాచలేరని పేర్కొన్నారు. నిజాలను బయట పెట్టేంతవరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని కేటీఆర్ స్పష్టం చేశారు. కాగా, గాంధీ ఆస్పత్రిలో ఒకే నెలలో 48 మంది శిశువులు, 14 మంది బాలింతలు చనిపోయారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నేతలను హౌజ్ అరెస్ట్ చేసినట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. దీంతో కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.

Read More : అది ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు: హరీశ్‌రావు సెన్సేషనల్ కామెంట్స్

Next Story

Most Viewed