చేవెళ్ల ఎంపీ టికెట్ ఎవరికి దక్కేనో?

by Sathputhe Rajesh |
చేవెళ్ల ఎంపీ టికెట్ ఎవరికి దక్కేనో?
X

దిశ, చేవెళ్ల : బీఆర్ఎస్ ప్రభుత్వం సిట్టింగ్‌లకే టికెట్స్ అనడంతో చేవెళ్ల ఎంపీ టికెట్‌పై పార్టీ వర్గాలలో చర్చ జరుగుతుంది. చేవెళ్ల ఎంపీగా ప్రస్తుతం గడ్డం రంజిత్ రెడ్డి కొనసాగుతుండగా 2024 ఎన్నికలలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తనయుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తునట్లు పార్టీ వర్గాలలో చర్చ జరిగింది. 2014 ఎన్నికలలో చేవెళ్ల ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కాలక్రమేనా కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరిన కార్తీక్ రెడ్డి ఇప్పుడు రంజిత్ రెడ్డి, కార్తీక్ రెడ్డి ఒక్కటే పార్టీలో ఉండడంతో చేవెళ్ళ ఎంపీ టికెట్ ఎవరికీ అని పార్టీ వర్గాలలో చర్చ జరుగుతుంది.

రంజిత్ రెడ్డి రాంజేంద్ర నగర్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో చేవెళ్ల ఎంపీ టికెట్ ఎవరికీ అన్న ప్రశ్న ప్రజల్లో ఉంది. ఇదిలా ఉంటే రాజేంద్రనగర్‌లో పట్లోళ్ల కార్తీక్ రెడ్డికి కొంత బలమైన క్యాడర్ ఉంది. ప్రస్తుతం చేవెళ్ల ఎంపీగా ఉన్న గడ్డం రంజిత్ రెడ్డి చేవెళ్ల గడ్డపై క్యాడర్ కూడగట్టుకున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ అవ్వాలనే ఆశతో గడ్డం రంజిత్ రెడ్డి ఉన్నారు. 2014లో చేవెళ్ల ఎంపీగా పోటీ చేసి ఓడినా పట్లోళ్ల కార్తీక్ రెడ్డికి 2018లో అవకాశం దక్కలేదు. రాబోయే ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా పట్లోళ్ళ కుటుంబం చేవెళ్ల గడ్డను ఏకధాటి 30 ఏళ్లు ఏలిన అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదని టాక్ ఉంది. ఈ పరిణామాల దృష్ట్యా ఫైనల్‌గా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందోననే ఆసక్తి నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed