- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధాన్యం కొనేదెవరు? రైతన్న ఎదురుచూపు
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతి ఏటా యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం నెల రోజుల ముందు నుంచే కార్యచరణ చేపట్టేది. ఈ సారి ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ లేకపోవడంతో సాగు చేసిన రైతన్న పండించిన పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక సతమతమవుతున్నారు. భరోసా ఇచ్చేవారు లేక మనోవేదనకు గురవుతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ధాన్యం కోతలు షురూ అయ్యాయి. అయితే ఏటా ప్రభుత్వం ౭ వేలకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొనుగోలు చేసేది. ముందస్తుగానే కొనుగోళ్లపై కసరత్తు చేసేది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తామనే ప్రకటన లేదు. కేంద్రమే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం... రాష్ట్రమే కొనుగోలు చేయాలని కేంద్రం ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. కానీ రైతులకు మాత్రం భరోసా కరువైంది. ఎవరు కొంటారు? ఎంతకు కొనుగోళ్లు చేస్తారనేది మాత్రం నేటికి స్పష్టత లేదు. దీంతో ఎవరికి అమ్ముకోవాలో తెలియక రైతులు మనోవేదనకు గురవుతున్నారు. ఎకరా సాగుకు రూ.15 వేల నుంచి 20వేల వరకు ఖర్చు చేసి సాగుచేసిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.
ఎక్కడ పోసుకోవాలి
పండించిన ధాన్యాన్ని రైతులు ఎక్కడ నిల్వ చేసుకోవాలి? ఎక్కడ అమ్ముకోవాలో తెలియదు. కేవలం రైతన్నకు ఆరుగాలం శ్రమించి పండించడమే తెలుసు. గతంలో మధ్య దళారులకు అమ్ముకున్న రైతు... ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇప్పుడు అతని పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఇంట్లో పోసుకుందామన్న సరిపడ స్థలం లేదు. నిల్వ చేసుకునేందుకు గోదాములు లేవు. దీంతో అప్పులు చేసి పండించిన పంటను అమ్ముకోవాలో తెలియక మనోవేదనకు గురవుతున్నాడు. ఒక వేళ మధ్య దళారులను ఆశ్రయించి అమ్ముకుందామంటే క్వింటాకు 1300 నుంచి 1400వరకు అమ్ముకోవాల్సిందే. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. పెట్టుబడులు పెరుగుతుండటంతో తక్కువకు అమ్మితే అప్పుల పాలై రైతన్న ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొనే అవకాశం ఉంది.
ఉపాధి కోసం సాగువైపు...
రాష్ట్ర ప్రభుత్వం సాగు చేయొద్దని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోమని వానాకాలం నుంచి చెబుతున్నప్పటికీ రైతన్నకు ప్రత్యామ్నాయం చూపలేదు. ఆరుతడి పంటలు వేస్తే కొనుగోలు కేంద్రాలు, మద్దతు ధరను సైతం ప్రకటించలేదు. గ్రామాల్లోని రైతులకు వ్యవసాయం తప్ప ఇతర పనులు రాకపోవడంతో కొంతమంది యాసంగికి సాగుకూ దూరంగా ఉండగా కొంతమంది రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ పై నమ్మకంతో సాగు చేశారు. అయితే వానాకాలం సాగుకు ఇప్పటికీ 20లక్షల ఎకరాలకు పైగా సాగు తగ్గిందని ప్రభుత్వమే పేర్కొంటుంది. కానీ కొనుగోలు కేంద్రాలపై స్పష్టత మాత్రం ఇవ్వడం లేదు. దీంతో రైతన్న పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ధాన్యం కొనుగోలు ఎవరు ముందుకువచ్చి కొనుగోలు చేస్తారోనని రైతన్నలు ఆశతో ఎదురు చూస్తున్నారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి =బండపల్లి జానయ్య, రైతు, తుడిమిడి
నాకు ఇద్దరు కుమారులు వారికి వివాహం చేశా. నాకున్న 6 ఎకరాల్లో వరి సాగు చేశా. కోతకు వచ్చింది. నాకు వ్యవసాయం తప్ప మరో పని రాదు. కుటుంబం మొత్తం వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. ఎప్పుడైన ప్రభుత్వం కొనేది ఇప్పుడు కొనమని చెబుతుంది. వడ్లు ఎవరికి అమ్ముకోవాలో తెలియడం లేదు. ప్రభుత్వమే కొని ఆదుకోవాలి.
ప్రభుత్వమే కొనుగోలు చేయాలి=దామెర్ల శ్రీనివాస్, రైతు, శాలిగౌరారం
మాది వ్యవసాయాధిరిత కుటుంబం. మాకున్న15 ఎకరాల్లో సాగు చేశా. 5 ఎకరాల్లో వరి కోసి వడ్ల రాసి పోశా. ప్రభుత్వమే కొంటదని సాగు చేశా. గతం నుంచి ప్రభుత్వమే కొంటుందని చెప్పింది. ఇప్పుడు కొంటదనే నమ్మకంతో వరి సాగు చేశాను. ప్రభుత్వం కొనకపోతే మధ్య దళారులు ఎంతకు అడిగితే అంతకు ఇవ్వాల్సి వస్తుంది. దీంతో సాగుకు పెట్టిన పెట్టుబడి సైతం వచ్చే పరిస్థితి ఉండదు. దేశానికి అన్నం పెట్టేది రైతన్న అంటారు. ఆ రైతన్న పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. మాకు ప్రభుత్వమే భరోసా ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయాలి.
నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశా =కప్పల నాగయ్య, ధర్మారం, అడ్డగూడురు
నాలుగు ఎకరాల్లో దొడ్డురకం సాగు చేశా. మేము అమ్ముకోవాలంటే మా దగ్గరల్లో మిల్లులు కూడా లేవు. ఎటు పోవాలన్న 40నుంచి 50 కిలో మీటర్లు పోవాలే. అక్కడి పోవాలంటే ట్రాక్టర్ కిరాయి 4వేలు అవుతుంది. ఇప్పటివరకు ఊరిలోనే కొనుగోలు కేంద్రం దగ్గర అమ్ముకున్న. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. మమ్ముల్ని కేసీఆర్ ఆదుకోవాలి.