తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ నెల 31 వరకు భారీ వర్షాలు

by Prasanna |   ( Updated:2024-08-27 15:51:28.0  )
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ నెల 31 వరకు భారీ వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు ఒక్కసారి వర్షం పడితే బావుండు.. వేసిన విత్తనాలైనా మొలుస్తాయని అన్నదాతలు వరుణ దేవుడిని వేడుకున్నారు. వారి కోరిక ఫలితమో ఏమో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. కానీ, ఇప్పుడు ఆ రైతులే వర్షాలు వద్దు మహాప్రభో అంటూ చేతులెత్తి మొక్కతున్నారు. ఎందుకంటే ఎక్కువ వర్షాలకు మొక్కలు చనిపోయే అవకాశం కూడా లేకపోలేదు. గత కొద్దీ రోజుల నుంచి జోరుగా వానలు పడుతూనే ఉన్నాయి.

ఆగస్టు 29 కి తూర్పు మధ్య, పరిసర ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావం తెలంగాణలో చూపనుంది. రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లోకొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ పలు జిల్లాలకు అలెర్ట్‌ను జారీ చేసింది.

హైదరాబాద్ నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 35.5 డిగ్రీలు నమోదు కాగా.. కనిష్ట ఉష్ణోగ్రతలు 25. 5 డిగ్రీలుగా ఉంది. కానీ, కొన్ని చోట్ల అక్కడకక్కడ వానలు పడే అవకాశాలున్నాయని వాతారణశాఖ అధికారులు తెలిపారు. అలాగే ఏపీలోని విజయవాడలో గరిష్ట ఉష్ణోగ్రతలు 37.5 డిగ్రీలుగా నమోదు కాగా .. కనిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలుగా ఉందని దీంతో, అక్కడక్కడ చిరు జల్లులు పడతాయని అధికారులు తెలిపారు

Advertisement

Next Story